• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను కేసీఆర్ ను క‌ల‌వ‌లేదు..! కేటీఆర్ తో వాట్స‌ప్ స‌భాష‌ణ బ‌య‌ట‌పెట్టిన ల‌గ‌డ‌పాటి..!!

|
  Telangana Elections 2018 : కేటీఆర్ తో వాట్స‌ప్ సంభాషణను బ‌య‌ట‌పెట్టిన ల‌గ‌డ‌పాటి..!! | Oneindia

  హైద‌రాబాద్ : తెలంగాణ‌లో మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌నాల‌కు తెర‌తీసారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌గురించి ప్రెస్ మీట్ల సిరీస్ నిర్వ‌హించిన ల‌గ‌డ‌పాటి కొన్ని ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీసే వ్యాఖ్య‌లు చేసార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప‌రంప‌ర‌లోనే నేడు తానెవరి ఒత్తిడితో సర్వే సమచారాన్ని మార్చలేదని లగడపాటి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నిన్న మంగళవారం లగడపాటి వెల్లడించిన సర్వే వివరాలు... చిలక జోస్యం అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై లగడపాటి రాజగోపాల్ బుధవారం మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించి స్పందించారు.

  నా స‌ర్వే ఎప్పుడూ పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది..! ప్ర‌లోభాల‌కు లొంగ‌నన్న ల‌గ‌డ‌పాటి..!!

  నా స‌ర్వే ఎప్పుడూ పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది..! ప్ర‌లోభాల‌కు లొంగ‌నన్న ల‌గ‌డ‌పాటి..!!

  ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ కేటీఆర్ సెప్టెంబర్ మాసంలో తన వద్దకు వచ్చి మా సంస్ధ చేసిన సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అప్పుడు మా టీమ్ చేసిన సర్వే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని వచ్చిందని చెప్పామని అయితే ఆ సర్వే మహాకూటమి ఏర్పడక ముందు చేసిన సర్వే ఫలితాలని చెప్పారు. అయితే ప్రస్తుతం సర్వే ఫలితాలు అందుకు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని... కొంతమందిని మారిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కేటీఆర్ కి చెప్పానని లగడపాటి తెలిపారు.

  ఇవిగో కేటీఆర్ తో జ‌రిపిన వాట్స‌ప్ సంభాష‌ణ‌లు..! స్క్రీన్ షాట్ షేర్ చేసిన రాజ్ గోపాల్..!!

  ఇవిగో కేటీఆర్ తో జ‌రిపిన వాట్స‌ప్ సంభాష‌ణ‌లు..! స్క్రీన్ షాట్ షేర్ చేసిన రాజ్ గోపాల్..!!

  ఎమ్యెల్యేల మీద వ్యతిరేకతే ఓటు కూటమికి పడేలా చేస్తోందని లడగపాటి చెప్పారు. కేటీఆర్ 23 మంది అభ్యర్ధుల పేర్లు పంపి వారి నియోజకవర్గాలపై సర్వే వివరాలు అడిగారని... తాను వాటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించి 37 స్ధానాల వరకూ సర్వే వివరాలు కేటీఆర్ కి పంపానని... అందులో ఎక్కువ స్ధానాల్లో కాంగ్రేస్ అభ్యర్ధులే అధిక్యతలో ఉన్నారని లగపాటి స్పష్టం చేశారు. తాను పంపిన సర్వే విరాలు చూసి స్పందించిన కేటీఆర్ క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు వేరేలా ఉన్నాయని మెసేజ్ పెట్టారని తెలిపారు. ఆతరువా నవంబర్ 20వ తేదీన 71 స్ధానాలు టీఆర్ఎస్ కి వస్తాయని మెసేజ్ పెట్టానని చెప్పుకొచ్చారు.

  విధ్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కాదు..! ప్ర‌జా నాడి చెప్పాల‌నేదే త‌న ప్ర‌య‌త్నం అన్న ఆక్టోప‌స్..!!

  విధ్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కాదు..! ప్ర‌జా నాడి చెప్పాల‌నేదే త‌న ప్ర‌య‌త్నం అన్న ఆక్టోప‌స్..!!

  ఆ సంఖ్యను దాటించి నిన్ను ఆశ్చర్యపరుస్తామని కేటీఆర్ నాకు తిరిగి మెసేజ్ పెట్టారని... నాకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలగదని... మీ ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూశామని నేను కూడా మెసేజ్ పెట్టినట్లు లగడపాటి చెప్పారు. తాను ఒక మిత్రుడిలా కేటీఆర్ కు అన్ని వివరాలు ఎప్పటికప్పుడు చెప్పానని... అయితే ఆయన నేను ఎవరి ఒత్తిడికో లోనై సర్వే రిపోర్టు మర్చి చెప్పినట్లు చేసిన ఆరోపణలు బాధించాయన్నారు. నాకు ఎవరితోనూ పనిలేదని, ఎవరికీ భయపడనని, నాకు వ్యక్తిత్వం ముఖ్యమని లగడపాటి చెప్పారు. ఈ ఐదేళ్లలో కేటీఆర్ ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. తాను విశ్వాసంగా, నిక్క‌చ్చిగా వాస్త‌వాలు చెపుతున్నానని లగడపాటి స్పష్టం చేశారు.

  ఎవ‌రిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు..! రాజకీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చన్న రాజ‌గోపాల్..!!

  ఎవ‌రిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు..! రాజకీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చన్న రాజ‌గోపాల్..!!

  తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని తెలిపారు లగడపాటి రాజగోపాల్. 2014లో పోలింగ్‌ శాతం 68.5గా నమోదైందని, అంతకుమించి నమోదైతే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు విజయావకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం తగ్గితే మాత్రం హంగ్‌ రావొచ్చని జోస్యం చెప్పారు. పోలింగ్‌ శాతాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని, పోలింగ్‌ పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించాలన్నారు. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని అంశాలను వెల్లడించారాయన. దీనిపై తెలంగాణ ఆపధ్దర్మ మంత్రి కేటీఆర్ స్పందించారు.

  English summary
  In Telangana, it is said that the people of the state are in the right hand, said Lagadapati Rajagopal. In 2014, the polling percentage was 68.5 per cent and the Congress-led public sector was the highest in the polls. Lagadapati Raj gopal revealed pre elections results yesterday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X