వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ పార్టీలో చేరడాన్ని నేనేందుకు వ్యతిరేకిస్తా: డికె అరుణ

కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను నేనేందుకు వ్యతిరేకిస్తానని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను నేనేందుకు వ్యతిరేకిస్తానని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

బుధవారం అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి డికె అరుణ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ' రేవంత్‌ రాకను నేనెందుకు వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించేవారెవరైనా ఉంటే నా పేరు చెబుతున్నారేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.

I didn't against to Revanth Reddy says DK Aruna

రేవంత్‌కు పదవులు ఇవ్వొద్దని నేనెందుకంటానని ఆమె ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదన్నారు. కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తుందని తాను అనుకోవడం లేదన్నారామె.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే మాజీ మంత్రి డికె అరుణతో చర్చించారు.. మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైద్రాబాద్‌లో సమావేశమై రేవంత్‌ పార్టీలో చేరే విషయాన్ని చర్చించారు. ఈ పరిణామాల తర్వాత రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

English summary
I didn't against to Revanth Reddy to join in Congress party. Former minister Dk Aruna chit chat with media in Assembly lobby on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X