• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోందో-కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు-రాహుల్,ప్రియాంకలకు ఫిర్యాదు చేయబోతున్నానని..?

|

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి,సీనియర్లకు మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జగ్గారెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు సందర్భం వచ్చిన ప్రతీసారి పార్టీ నాయకత్వంపై నిరసన గళం విప్పుతూనే ఉన్నారు.తాజాగా ఎమ్మెల్యే,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపాయి. అయితే ఏఐసీసీ ఇన్‌చార్జిలు రంగంలోకి దిగి జగ్గారెడ్డిని వెనక్కి తగ్గేలా చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ నాయకత్వ తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి,అసహనం వ్యక్తం చేశారు.

హుజురాబాద్ సంగతేంటి... : కోమటిరెడ్డి

హుజురాబాద్ సంగతేంటి... : కోమటిరెడ్డి

'పీసీసీ నేతలు హుజురాబాద్ ఎందుకు వెళ్లడం లేదు... పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకావడం లేదు... హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ ఓటు బ్యాంకు ఉంది. గత మూడు ఎన్నికల్లో 60 వేల వరకు ఓట్లు వచ్చాయి. అందరం కలిసి పనిచేస్తే మరో 50 వేల ఓట్లు రావా...' అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో సీనియర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి... వారానికో సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ గెలవదా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

రాహుల్,ప్రియాంకలతో మాట్లాడబోతున్నా : కోమటిరెడ్డి

రాహుల్,ప్రియాంకలతో మాట్లాడబోతున్నా : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉన్న దుబ్బాకలో సైతం 23 వేల ఓట్లు వచ్చాయని... అలాంటిది పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉన్న హుజురాబాద్‌ను వదిలేస్తే దానర్థమేంటని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో యుద్ధానికి ముందే చేతులెత్తేస్తామా అని నిలదీశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ భరించలేకనే పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఇలాంటి షో రాజకీయాలు తనకు తెలియవని అన్నారు. సీనియర్లను సంప్రదించకుండా అధికార ప్రతినిధులను నియమించడమేంటని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి... పార్టీ ఇలాగేనా సన్నద్దమయ్యేది... ఇవన్నీ వచ్చేవారం రాహుల్,ప్రియాంక గాంధీలతో మాట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

హుజురాబాద్‌ను పట్టించుకోని రేవంత్..?

హుజురాబాద్‌ను పట్టించుకోని రేవంత్..?

హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో కోమటిరెడ్డి గతంలోనూ కాంగ్రెస్ నాయకత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.త్వరగా అభ్యర్థిని ప్రకటించి,ఇన్‌చార్జిలను నియమించాలని డిమాండ్ చేశారు. అయితే కోమటిరెడ్డి డిమాండుపై సొంత పార్టీలోనే మల్లు రవి లాంటి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇంకా ఉపఎన్నిక నోటిఫికేషనే రాలేదని... ఇప్పుడే అంత తొందర అవసరం లేదని మల్లు రవి వ్యాఖ్యానించారు. ఓవైపు టీఆర్ఎస్,బీజేపీలు ఇప్పటికే హుజురాబాద్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్‌ను లైట్ తీసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఉపఎన్నిక ఇన్‌చార్జిగా ఉన్న దామోదర రాజనర్సింహ అడపాదడపా అటు వైపు వెళ్లి రావడమే తప్ప.... ఇప్పటివరకూ యాక్షన్ ప్లాన్ అంటూ లేకుండా పోయింది. హుజురాబాద్ విషయంలో రేవంత్ వైఖరి పట్ల గతంలో కౌశిక్ రెడ్డి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.రేవంత్ రెడ్డి,ఈటల ఇద్దరూ కుమ్మక్కయ్యారని... అందుకే రేవంత్ హుజురాబాద్‌పై ఫోకస్ పెట్టట్లేదని ఆరోపించారు.ఎవరెన్ని ఆరోపణలు చేసినా... సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. రేవంత్ మాత్రం ఇప్పట్లో హుజురాబాద్‌పై ఫోకస్ చేసే సూచనలు కనిపించట్లేదు.

సీనియర్ల అసంతృప్తి... బహిర్గతమవుతున్న విభేదాలు

సీనియర్ల అసంతృప్తి... బహిర్గతమవుతున్న విభేదాలు


పార్టీలో రేవంత్ వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారని సీనియర్లు పదేపదే విమర్శిస్తున్నారు. రేవంత్ తమను కలుపుకుని వెళ్లడం లేదని... ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఇవే ఆరోపణలు చేశారు.తన నియోజకవర్గంలోని జహీరాబాద్‌లో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే తనకు సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌నే పట్టించుకునే పరిస్థితి లేకపోతే... ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఇదే విషయమై మల్లు రవి జగ్గారెడ్డిని వారించగా... నన్ను ప్రశ్నించే అర్హత మీకెక్కడిది అంటూ ఆయనపై కూడా ఫైర్ అయ్యారు. అయితే ఏఐసీసీ ఇన్‌చార్జిలు బోసు రాజు,శ్రీనివాస్ కృష్ణన్ రంగంలోకి దిగి ఇరువురు నేతలకు సర్దిచెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఏదేమైనా కాంగ్రెస్‌లో రేవంత్‌కు,సీనియర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనేది జగ్గారెడ్డి ఎపిసోడ్‌తో మళ్లీ బయటపడింది. తాత్కాలికంగా సయోధ్య కుదిరినట్లు కనిపించినా... ఉన్నట్టుండి ఏదొక సందర్భంలో విభేదాలు బహిర్గతమవడం కామన్‌గా మారిపోయింది.

English summary
'PCC leaders are not going to Huzurabad ... I do not understand what is actually going on in the party ... Congress has a huge vote bank in Huzurabad. The last three elections saw up to 60,000 votes. If everyone works together, another 50,000 votes will come ... 'asked Komatireddy Venkat Reddy. Komatireddy Venkat Reddy questioned whether the party would win if the in-charge responsibilities were handed over to the seniors in Huzurabad constituency and a weekly meeting was arranged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X