వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన కీలకమైన సమాచారం ఆదారంగా డ్రగ్ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 10 గంటలపాటు పూరీ జగన్నాధ్‌ను పోలీసులు విచారించారు. ఆగష్టు మూడవ తేది తర్వాత పూరీ జగన్నా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన కీలకమైన సమాచారం ఆదారంగా డ్రగ్ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 10 గంటలపాటు పూరీ జగన్నాధ్‌ను పోలీసులు విచారించారు. ఆగష్టు మూడవ తేది తర్వాత పూరీ జగన్నాధ్‌ను విచారించనున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే సిట్ విచారణపై పూరీజగన్నాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు కెల్విన్ ఎవరో తెలియదని సిట్ అధికారులకు చెప్పినట్టు ట్వీట్ చేశారు.

డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!

డ్రగ్ కేసు తెలుగు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపేస్తోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ పోలీసులు నోటీసులు జారీచేశారు.

పూరీ జగన్నాథ్‌ను కెల్విన్ ఎలా పరిచయంతో పాటు డ్రగ్ వ్యవహరంపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ విషయంలో ఎక్సైజ్ పోలీసులకు జగన్నాథ్ సహకరించారని పోలీసులు ప్రకటించారు.

డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!

అయితే 10 గంటలపాటు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నించారనే అంశాలే ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.అయితే పోలీసులకు ఆయన పూర్తిగా సహకరించారని అధికారులే ప్రకటించారు.

తప్పు పనులను చేయను

తప్పు పనులను చేయను

పదిగంటల విచారణ తర్వాత నేరుగా ఇంటికి చేరుకొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు మూడు నిమిషాల ఆడియోను ట్వీట్ చేశారు. సిట్ అధికారులకు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. కెల్విన్ గ్యాంగ్ తో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. కెల్విన్ ముఠాతో కలవలేదు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పా. తప్పుడు పనులను చేయలేదు. ఎప్పుడూ చేయలేదు. పోలీసు శాఖంటే తనకు ఇష్టమన్నారు. జర్నలిస్టులపై సినిమా తీశాను. నాలుగు రోజుల నుండి తన కుటుంబసభ్యులు ఏడుస్తున్నారు. జర్నలిస్టులు తెలిసి తెలియకుండా వార్తలు రాశారు. కెల్విన్‌ను కలవలేదని చెప్పాను. ఎప్పుడూ పిలిచినా వెళ్తానని చెప్పారు. కట్టుకధలను ప్రచారం చేశారు. జర్నలిస్టులు తనకు స్నేహితులు. అయితే తెలిసి తెలియకుండా రాశారు. జీవితాలను నాశనం చేశారు. సిట్ అధికారులు నిర్ణయిస్తారు.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
కీలక సమాచారాన్ని వెల్లడించారు

కీలక సమాచారాన్ని వెల్లడించారు

పూరీ జగన్నాథ్‌ వి,చారణ సందర్భంగా కీలకమైన సమాచారాన్ని వెల్లడించారని ఎక్సైజ్ పోలీసులు అధికారులు ప్రకటించారు. ఈ సమాచారం ఆధారంగానే దర్యాప్తు చేయాలని ఎక్సైజ్ పోలీసులు నిర్ణయించారు. అంతేకాదు కెల్విన్‌తో సంబంధాలపై ప్రధానంగా పూరీ జగన్నాథ్‌ను విచారించారు. నలుగురు విచారణాధికారులు తమ ఫోన్లను కూడ పక్కనపెట్టి విచారణ నిర్వహించారు. అంతేకాదు నలుగురు అధికారులు పూరీ జగన్నాథ్ మినహ ఇతరులెవ్వరినీ కూడ ఈ సమావేశంలోకి అనుమతించలేదు.

.ఆగష్టు 3వ, తేది తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్ విచారణ

.ఆగష్టు 3వ, తేది తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్ విచారణ


ఈ ఏడాది ఆగష్టు 3వ, తేది తర్వాత పూరీ జగన్నాథ్‌ను విచారించనున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవాళ విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయనున్నారు ఎక్సైజ్ అధికారులు. అయితే డ్రగ్ తీసుకొంటున్నాడా లేదా అంశాన్ని నిర్ధారించుకొనేందుకుగాను పూరీ జగన్నాథ్ రక్తనమూనాలను ఎక్సైజ్ అధికారులు సేకరించారు.

 కొరియర్ ద్వారా డ్రగ్స్

కొరియర్ ద్వారా డ్రగ్స్

కెల్విన్ కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను చేరవేసినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పూరీ జగన్నాథ్ విచారణ సందర్భంగా ఈ అంశం వెలుగుచూసినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇంకా కీలకమైన సమాచారాన్ని ఆయన అందించినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే మూడు కొరియర్ సంస్థలకు నోటీసులు పంపారు ఎక్సైజ్ పోలీసులు .విచారణకు హజరుకావాలని బ్లూడాట్, ఫిడెక్స్, డిహెచ్ఎల్ కొరియర్ సంస్థలకు నోటీసులు వెళ్ళాయి.. ఈ సంస్థల ప్రతినిధులను కూడ విచారించనున్నారు.

English summary
Tollywood director Puri Jagannath responded on SIT enquiry. He tweeted about SIT enquiry on Wednesday night. I don't know Kelvin he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X