వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీలాంటోణ్ణి: సీఎం పోస్టుపై జానా వైరాగ్యం

2019 ఎన్నికల్లో తాను సీఎం పదవిని అడగనని సిఎల్పీ నేత జానారెడ్డి ప్రకటించారు. సీఎం పదవిని చేపట్టాలని అందరు కోరుకొంటేనే తాను సీఎం పదవిని చేపట్టనున్నట్టు జానారెడ్డి ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తాను సీఎం పదవిని అడగనని సిఎల్పీ నేత జానారెడ్డి ప్రకటించారు. సీఎం పదవిని చేపట్టాలని అందరు కోరుకొంటేనే తాను సీఎం పదవిని చేపట్టనున్నట్టు జానారెడ్డి ప్రకటించారు. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

గెలుపు గుర్రాలకే: రేవంత్‌రెడ్డి చేరిన వెంటనే ఉత్తమ్ మాట ఇదీగెలుపు గుర్రాలకే: రేవంత్‌రెడ్డి చేరిన వెంటనే ఉత్తమ్ మాట ఇదీ

మంగళవారం నాడు అసెంబ్లీలో జానారెడ్డి మీడియాతో జానారెడ్డి చిట్‌చాట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలపై జానారెడ్డి స్పందించారు.

తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బతెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

టిడిపిని వీడి రేవంత్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో మంగళవారం నాడు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ అంశాలపై జానా స్పందించారు.

రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

సీఎం పదవిని అడగనని ప్రకటించిన జానారెడ్డి

సీఎం పదవిని అడగనని ప్రకటించిన జానారెడ్డి

2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని తాను అడగబోనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి మినహ ఇతర మంత్రి పదవులను జానారెడ్డి నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు పాలన అనుభవం ఉన్న నేతగా జానారెడ్డికి ఉంది. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కోరుకొంటేనే తాను సీఎం పదవిని స్వీకరించనున్నట్టు జానారెడ్డి ప్రకటించారు.

అద్వానీతో పోల్చుకొన్న జానారెడ్డి

అద్వానీతో పోల్చుకొన్న జానారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీలో అద్వానీలాంటివాడినోనని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు అద్వానీ కీలక ప్రయత్నం చేశారు. అయితే ప్రధానమంత్రిని మాత్రం చేపట్టలేదు అద్వానీ,జానారెడ్డి కూడ సీఎం పదవిని మాత్రం చేపట్టలేదు. కానీ, అన్ని రకాల మంత్రి పదవులను చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అద్వానీలాంటివాణ్ణని జానారెడ్డి ప్రకటించడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.

శక్తిని నిరూపించుకొంటేనే బాహుబలి

శక్తిని నిరూపించుకొంటేనే బాహుబలి

పార్టీలో చేరగానే బాహుబలి అయిపోతారనే విషయంలో వాస్తవం లేదని జానారెడ్డి పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకొన్నప్పుడే బాహుబలి అవుతారని చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా చేసి ఫలితం సాధించవాడే బాహుబలి అని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ సమావేశాలపై జానారెడ్డి అసంతృప్తి

అసెంబ్లీ సమావేశాలపై జానారెడ్డి అసంతృప్తి

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు సరిగాలేదన్నారు జానారెడ్డి. ప్రజల ఆశలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందని భావిస్తే, అందుకు విరుద్దంగా సాగుతోందని ఆయన ఆరోపించారు. సభలో అధికార పార్టీకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలను అసలు చూపించడంలేదు.. దీన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని జానారెడ్డి పేర్కొన్నారు. బీఏసీ నిర్ణయానికి మేం కట్టుబడటంలేదనడం అవాస్తవమని ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు

English summary
Senior Congress leader CLP leader Jana Reddy announced that I don't want CM post.If congress leaders request to me take CM post, I will take CM post. Jana reddy chit chat with media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X