హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షం అంటేనే భయమేస్తోంది: కేటీఆర్, ఎందుకలా అన్నారు?..

పూర్తి స్థాయి మెషినరీతోనే మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేయిస్తామని తెలిపారు. సీవరేజీ వ్యవస్థ మొత్తం మారాలంటే రూ.11వేల కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వర్షకాలం పేరెత్తితేనే ఒకరకమైన భయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడనప్పటికన్నా.. వర్షం పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కాబట్టి వర్షం పడకపోయినా పర్వాలేదు కానీ వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.

డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి 70మినీ జెట్టింగ్ మెషీన్లను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం నుంచి వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. మ్యాన్ హోల్స్‌ను మాన్యువల్ గా శుభ్రం చేయడాన్ని ఇక మీదట పూర్తిగా ఆపేస్తామని అన్నారు.

i feel fear about rain in hyderabad says ktr

పూర్తి స్థాయి మెషినరీతోనే మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేయిస్తామని తెలిపారు. సీవరేజీ వ్యవస్థ మొత్తం మారాలంటే రూ.11వేల కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. త్వరలో వర్షాకాలం రాబోతున్నందునా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

English summary
Minister Ktr said he feels fear in rainy season for several areas of the city sparking fears of waterlogging
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X