వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ప్రజల ఓట్లతోనే గెలవాటి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించినప్పటికీ.. తీరులో చాలా సార్లు మోనార్క్‌లా వ్యవహరిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొందరు చెప్పేమాట. ఆయనతో 20ఏళ్ల అనుబంధమున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సైతం కేసీఆర్ వ్యవహార శైలిపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు ఇష్టం లేని విషయాన్ని ఎంత చెప్పినా వినరని, అదే తనకు ఇష్టమైన పని చెబితే వెంటనే చేస్తారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గులాబీ బాస్‌పై కమాండ్ సాధించగలిగానని ఈటల చెప్పారు.

 </a></strong><strong><a class=జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే.." title=" జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే.." /> జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..

సంచలనం రేపుతోన్న ఈటల..

సంచలనం రేపుతోన్న ఈటల..

తెలంగాణ ఉద్యమ సమయం నుంచే టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యుడిగా.. కేసీఆర్ కు ఆప్తుడిగా మెలిగిన ఈటల రాజేందర్.. గడిచిన ఏడేళ్లుగా కేబినెట్ లో కొనసాగుతూనే ఉన్నారు. కేసీఆర్ తనయుడు కేసీఆర్, అల్లుడు హరీశ్ రావులకు ధీటుగా తనకంటూ ఇమేజ్ ఏర్పర్చుకున్న ఈటల.. ఒక దశలో టీఆర్ఎస్ లో నంబర్ 2గానూ వ్యవహరించిన సందర్భాలున్నాయి. అయితే, ఇప్పుడు సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకొని, ఆ సీటును తన కొడుకైన మంత్రి కేటీఆర్ కు కట్టబెట్టబోతున్నట్లు బాహాటంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిలో కొనసాగడం, కేసీఆర్ తో అనుబంధం తదితర అంశాలపై మంత్రి ఈటల వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

 నిన్న పదవిపై.. ఇవాళ సీఎంపై..

నిన్న పదవిపై.. ఇవాళ సీఎంపై..

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలను వివిధ జిల్లాల్లో ఆవిష్కరిస్తోన్న ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అదే పనిగా అనూహ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ''కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా.. నేను మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా మేమిద్దం మాత్రం ఎప్పటికీ రైతుల పక్షానే ఉంటాం''అని సోమవారం వ్యాఖ్యానించిన ఈటల.. మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో రైతు వేదికను ప్రారంభిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కమాండ్ ఉన్నట్లు తెలిపారు.

 ఏడుపును కేసీఆర్ తట్టుకోలేరు..

ఏడుపును కేసీఆర్ తట్టుకోలేరు..

''కేసీఆర్ తో నాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది. సుదీర్ఘ అనుబంధం కారణంగా ఆయనపై నాకు అజమాయిషీ కూడా ఉంది. అయితే, సీఎం తనకు ఇష్టమైన పనినే చేస్తారు. ఇష్టం లేకుంటే వినరు. మా ఇద్దరికీ వ్యవసాయం కామన్ ఇంట్రెస్ట్. రైతులంటే ప్రాణం. రైతులు ఏడిస్తే కేసీఆర్ తట్టుకోలేరు. అందుకే తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా అత్యధికంగా సాగు రంగంపైనే ఆయన అత్యధిక సమీక్షలు చేసి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండాలనేది కేసీఆర్ కోరిక'' అని మంత్రి ఈటల అన్నారు.

జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..

English summary
telangana health minister, trs seniour leader etala rajender once againg made an intresting comments on tuesday. referring their 20 years friendship, rajender said that he has controll on chief minister kcr. earlier etela expressed dought on his minister post
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X