హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ అంటే ఇష్టం, బిర్యానీ తినకుండా వెళ్లను: సచిన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భాగ్యనగరమంటే అంటే తనకెంతో ఇష్టమని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పారు. అంతేగాక, ఇక్కడి ప్రజల ప్రేమను మరచిపోలేనన్నారు. తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బిర్యానీ రుచి చూస్తానని సచిన్ చెప్పారు.

గురువారం కూకట్‌పల్లిలోని ఫోరం సుజనామాల్‌లో స్మాష్‌ గేమింగ్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జీవితంలో ఆటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఖాళీ సమయం దొరికితే కుటుంబంతో కలిసి ముంబయిలోని గేమింగ్‌ కేంద్రానికి వెళ్తానన్నారు.

I like Hyderabad very much, says Sachin Tendulkar

ఉరుకుల పరుగుల జీవితంలో ఆటలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని ఈ మాజీ క్రికెటర్‌ అన్నారు. పిన్‌బాల్‌, గో కార్ట్‌ గేమ్‌లతో పాటు ఫుట్‌బాల్‌ ఆటను ఎక్కువగా ఇష్టపడతానన్నారు. గేమింగ్‌ కేంద్రం మార్కెటింగ్‌ ఉపాధ్యక్షులు శ్రీనిలేందూ మిత్రా మాట్లాడుతూ.. సచిన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు.

Recommended Video

Sachin Tendulkar Donates His Entire Salary PM's Relief Fund
I like Hyderabad very much, says Sachin Tendulkar

దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్‌ కేంద్రాలలో పిన్‌ స్ట్రైక్‌ నేషనల్‌ కార్పొరేట్‌ బౌలింగ్‌ టోర్నమెంట్‌-2018 పోటీలను నిర్వహించామని, హైదరాబాద్‌, ఢిల్లీ మొదటి రెండు విజేతలుగా నిలిచాయన్నారు. హైదరాబాద్ నగరంలోని ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న బృందానికి మొదటి బహుమతిగా రూ.3లక్షల చెక్కు, జ్ఞాపికను..రెండో బహుమతి పొందిన ఢిల్లీ బృందానికి రూ.1.50 లక్షల చెక్కును సచిన్‌ అందజేశారు.

English summary
Cricket Legend Sachin Tendulkar on Thursday presented trophy to Pinstrike national corporate bowling tournament – 2018 winners at Forum Sujana mall with a huge fanfare. Master Blaster re-inaugurated Smash centre at the same mall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X