హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిక్కెట్ రానందుకు బాధగా లేదు, నాకేం ఆసక్తి లేదు, కేసీఆర్‌కే చెల్లింది: దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవలేదని మాజీ మంత్రి, కొద్ది రోజుల క్రితం తెరాసలో చేరిన దానం నాగేందర్ సోమవారం తెలిపారు. తను ఓ హోటల్లో ఉత్తమ్‌ను కలిసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడంపై స్పందించారు. తనకు టిక్కెట్ రాకపోవడంపై కూడా ఆయన మాట్లాడారు. ఎప్పుడూ లేనివిధంగా ఒక్కసారే 105మంది అభ్యర్థులను ప్రకటించడం ఒక్క కేసీఆర్‌కే చెల్లిందన్నారు.

I never met Uttam Kumar Reddy after joining TRS, says Danam

టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది జాబితాలో తన పేరు లేకపోవడంపై బాధగా లేదని చెప్పారు. తాను ఇప్పటికే అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పదవిపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదని చెప్పారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో కూడా అసంతృప్తి వస్తుందని చెప్పారు.

కాంగ్రెస్‌తో పొత్తు: అందుకే టీటీడీపీ పైనే చంద్రబాబు భారం, ఈ సీట్లు అడుగుదాం..కాంగ్రెస్‌తో పొత్తు: అందుకే టీటీడీపీ పైనే చంద్రబాబు భారం, ఈ సీట్లు అడుగుదాం..

తాను బేషరతుగా టీఆర్ఎస్‌లో చేరానని దానం చెప్పారు. ఎలాంటి ఎలాంటి పదవులు ఆశించడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్‌ రాకుండా చిత్తుగా ఓడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.

English summary
Former Minister and TRS leader Danam Nagender said that he never met TPCC chief Uttam Kumar Reddy after joining TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X