వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు నేనే ఆ సలహ ఇచ్చా: లక్ష్మీపార్వతి సంచలనం

మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెప్పింది తానేనని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

మద్యపానం నిషేధించాలని సలహ ఇచ్చింది నేనే !

హైదరాబాద్: మద్యపానం నిషేధించాలని స్వర్గీయ ఎన్టీఆర్‌కు చెప్పింది తానేనని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. 1994 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎన్టీఆర్ అమల్లోకి తెచ్చారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1994 ఎన్నికలకు ముందు సారాయి వ్యతిరేక ఉద్యమం సాగింది. నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ ప్రారంభించిన ఉద్యమం రాష్ట్ర మంతటా వ్యాపించింది. ఆనాడు విపక్షంలో ఉన్న టిడిపి, సారాయి వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచింది.

అంతేకాదు తాము అధికారంలోకి వస్తే సారాయేకాదు సంపూర్ణంగా మద్యాన్ని నిషేధాన్ని విధిస్తామని ఆనాడు ఎన్టీఆర్ ప్రకటించారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేసింది. అయితే అమల్లో లోపాల కారణంగా మద్యం దుకాణాల్లో దొరకలేదు. కానీ,ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి రహస్యంగా విక్రయాలు కూడ చేసిన సందర్భాలు కూడ ఆనాడు చోటు చేసుకొన్నాయి.

 మధ్యనిషేధం విధించాలని ఎన్టీఆర్‌కు సలహ

మధ్యనిషేధం విధించాలని ఎన్టీఆర్‌కు సలహ

1994 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఎన్టీఆర్‌కు తాను సలహ ఇచ్చానని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. మంగళవారం నాడు ఆమె హైద్రాబాద్‌లో మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఎన్టీఆర్‌కు సూచించినట్టు ఆమె గుర్తు చేశారు. తన సలహ మేరకు ఎన్టీఆర్ ఆనాడు అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకొన్నారని ఆమె ప్రస్తావించారు.

 బాబు వచ్చాక మద్యనిషేధం ఎత్తివేత

బాబు వచ్చాక మద్యనిషేధం ఎత్తివేత

1995 ఆగష్టు సంక్షోభం తర్వాత చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే బాబు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మద్యనిషేధాన్ని ఎత్తివేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ నిర్ణయం తీసుకొనే సమయంలో ప్రజల నుండి, స్వచ్చంధసంస్థల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకొన్నారు. అయితే మద్య నిషేధం అమల్లో ఆనాడు చోటుచేసుకొన్న లోపాల కారణంగా మద్యనిషేధం విఫలమైందనే ప్రభుత్వంపై విమర్శలు చేలరేగాయి. ఈ తరుణంలో మద్యనిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చిందని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.

ఇంటి పక్కనే వైన్‌షాప్ ఏర్పాటుపై లక్ష్మీపార్వతి నిరసన

ఇంటి పక్కనే వైన్‌షాప్ ఏర్పాటుపై లక్ష్మీపార్వతి నిరసన

తన ఇంటి పక్కన వైన్‌షాప్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరికాదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. లక్ష్మీపార్వతి నివాసానికి దగ్గర్లో వైన్‌షాప్ ఏర్పాటుచేయాలని నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తన ఇంటికి సమీపంలోనే వైన్‌షాప్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె ఎక్సైజ్ కమిషనర్‌కు ఫిర్యాదుచేశానని చెప్పారు.

రాష్ట్రాలకు ఆదాయ వనరులుగా మద్యం

రాష్ట్రాలకు ఆదాయ వనరులుగా మద్యం

రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదాయ వనరులుగా మద్యం విక్రయాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రంలో కూడ ఎక్సైజ్ శాఖ నుండి భారీగా ఆదాయం వస్తోంది. చాలా రాష్ట్రాలు ఎక్సైజ్ శాఖను ఆదాయాన్ని సమకూర్చే శాఖగా చూస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయం ఎక్సైజ్ శాఖ నుండి వస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
I suggested NTR to implement liquor ban before 1994 Assembly elections said Laxmi parvathi. NTR implemented my suggetion on liquor ban she rembered.Laxmiparvathi spoke to media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X