వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరా తీశారు.లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో బుదవారం నాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరా తీశారు.లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో బుదవారం నాడు ఫోన్‌లో మాట్లాడారు. రేవంత్‌ వ్యవహరాన్ని బాబుకు రమణ వివరించారు. అంతేకాదు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని బాబును కోరారు ఎల్. రమణ, అయితే ఈ విషయమై బాబు కూడ సానుకూలంగా స్పందించారని సమాచారం.మరోవైపు చంద్రబాబుకే తాను వివరణ ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై ఎవరితోనూ చర్చించబోనని ప్రకటించారు.

Recommended Video

రేవంత్‌రెడ్డిని పదవుల నుండి తొలగిస్తున్నారా?TDLP

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: టిడిఎల్‌పిలో ఏం జరుగుతోంది, పార్టీ ఎందుకు వీడుతున్నారు?

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై ఆ పార్టీ నాయకత్వం సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్‌రెడ్డి సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టిడిఎల్పీ సమావేశం నిర్వహించకూడదని రేవంత్‌ను ఎల్. రమణ ఆదేశించారు.

ముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డిముదురుతున్న వివాదం: తగ్గని రేవంత్‌రెడ్డి

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్ళే రోజునే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ వెలుగుచూసింది. అదే రోజు ఢిల్లీలో కాంగ్రెరస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని రేవంత్‌రెడ్డి కలిశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై రేవంత్‌రెడ్డి నుండి స్పష్టమైన వివరణ రాలేదని టిడిపి నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

ఎపిసోడ్‌పై బాబు ఆరా

ఎపిసోడ్‌పై బాబు ఆరా

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరా తీశారు..రేవంత్ వ్యవహరశైలిపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ప్రతి రోజూ ఎల్. రమణతో చంద్రబాబునాయుడు ఈ విషయమై చర్చిస్తున్నారు. అదే సమయంలో రేవంత్ ఏం చేయనున్నారనే దానిపై పార్టీ నాయకత్వం చంద్రబాబుకు సమాచారం ఇచ్చిందని సమాచారం. అంతేకాదు రేవంత్‌ను పార్టీ పదవుల్లో కొనసాగిస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దరిమిలా రేవంత్‌ను పార్టీ పదవుల నుండి తప్పించాలని ఎల్. రమణ చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు స్వదేశానికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొంటానని హమీ ఇచ్చారని సమాచారం.

చంద్రబాబుకే వివరణ ఇస్తానంటున్న రేవంత్

చంద్రబాబుకే వివరణ ఇస్తానంటున్న రేవంత్

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూడ టిడిపి నేతలకు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకే తాను వివరణ ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబునాయుడు విదేశాల నుండి స్వదేశానికి తిరిగివచ్చేవరకు తాను ఎవరితో కూడ ఈ విషయమై మాట్లాడబోనని ప్రకటించారు.

ఆ అధికారం వారికి లేదన్న రేవంత్

ఆ అధికారం వారికి లేదన్న రేవంత్

టిడిఎల్పీ సమావేశం నిర్వహించకుండా అడ్డుపడే అధికారం పార్టీ నేతలకు లేదని టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభ వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడానికి పార్టీ నేతలకు హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి టిడిఎల్పీ సమావేశం యధావిధిగా కొనసాగుతోందని ప్రకటించారు. ఈ సమావేశం నిర్వహించకుండా అడ్డుకొనే అధికారం పార్టీ నేతలకు లేదన్నారు.

ఆ మీటింగ్‌ గురించి తెలియదన్న రేవంత్

ఆ మీటింగ్‌ గురించి తెలియదన్న రేవంత్

గోల్కొండ హోటల్ సమావేశం గురించి తనకు తెలియదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గోల్కోండ హోటల్‌లో టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల సమావేశం అక్టోబర్ 26వ, తేది మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి టిడిపి నేతలు కూడ హజరుకానున్నారు. అయితే ఈ సమావేశం గురించి తనకు తెలియదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

English summary
I Will explain every thing to party chief Chandrababu Naidu said TDP working president Revanth Reddy.Chandrababunaidu phoned to TTDP president L. Ramana on Wednesday morning. Chandrababu Naidu enquired about revanth reddy issue with Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X