వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ, ఈ 9 రోజులు ఎవరినీ ఏమీ అనను: కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కొందరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు గానీ బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తాను రాజకీయ విమర్శలు చేయబోనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని బస్ డిపో మైదానంలో బంగారు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఆశా కార్యకర్తల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని అన్నారు. తాను కూడా ఆశా కార్యకర్తల సమస్యలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానని, వారికి న్యాయం చేస్తానని ఆమె చెప్పారు. ఆశ కార్యకర్తలు సమ్మె విరమించిం తమతో పాటు సంబురాల్లో పాల్గొనాలని ఆమె కోరారు. దేశంలో ఆడపిల్లలు వందకు వంద శాంత చదువుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ఆమె అన్నారు.

హుస్నాబాద్ కాకతీయులు పరిపాలించిన ప్రాంతమనిస ఇక్కడ వెయ్యికి పైగా గుడులు కట్టించారని, 750కిపైగా చెరువులు తవ్వించారని, కాకతీయ వీరవనిత రుద్రమదేవి స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముందుకెళ్దామని కల్వకుంట్ల కవిత అన్నారు.

పదిహేను నెలల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌కు మూడసార్లు వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.450 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్‌లో కూడా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బతుకమ్మ పేర్చిన కవిత

బతుకమ్మ పేర్చిన కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చి, మహిళలతో ర్యాలీగా హుస్నాబాద్‌లోని డిపో గ్రౌండ్స్‌కు చేరుకుని బతుకమ్మల ఆడారు.

సగం మంది ఆడబిడ్డలే...

సగం మంది ఆడబిడ్డలే...

తెలంగాణ జనాభాలో సగం మేర అడబిడ్డలు ఉన్నారనీ, వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారని కల్వకుంట్ల కవిత అన్నారు.

తీర్చి దిద్దాలి...

తీర్చి దిద్దాలి...

దేశంలో వంద శాతం మహిళలు అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని కల్వకుంట్ల కవిత ఆశించారు.

మంచి విద్య అందుతుంది

మంచి విద్య అందుతుంది

అందరికీ విద్య కోసం ప్రభుత్వం త్వరలో కేజీ టూ పీజీ విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నదని కవిత అన్నారు. ఈ విధానంతో పేదలకు కూడా మంచి విద్య అందనున్నదన్నారు.

ఇక్కడా పరిశ్రమలు..

ఇక్కడా పరిశ్రమలు..

హైదరాబాద్, వరంగల్‌తోపాటు కరీంనగర్‌ జిల్లాలో కూడా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.

బతుకమ్మ ఆడారు...

బతుకమ్మ ఆడారు...

బంగారు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని డిపో గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) Nizamabad MP Kalvakuntla Kavitha said that she will make political comments till Bathukamma festival overs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X