వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్తీమే సవాల్: కవిత మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

|
Google Oneindia TeluguNews

Recommended Video

కవిత పై మండి పడ్డ కోమటి రెడ్డి

దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా తిరిగి కవితను గెలిపించుకుంటే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఒక సీఎం కూతురిగా ఎంపీ కవిత జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు విషయంలో కవితకు చిత్తశుద్ధి లేదని చెప్పిన కోమటిరెడ్డి...

కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఎంసెట్ పేపర్ లీకేజీ కేసును ప్రభుత్వం కావాలనే పక్కకు పెట్టిందని ఇందుకు కారణం శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో కేసీఆర్ కుటుంబానికి 40శాతం వాటాలు ఉన్నందునే అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

I will quit politics if Kavitha wins again in Nizamabad:komatireddy

ఇక తనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. కావాలనే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉద్ఘాటించారు. తనకు గన్‌మె‌న్‌ను కూడా తొలగించారని చెప్పారు. ఇక ఇదే విషయమై ఈనెల 13న కోర్టు తుది తీర్పు ఇవ్వనుందని కోమటిరెడ్డి వివరించారు.

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాలు ఏకం కావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్‌ నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.

English summary
"If MP Kavitha wins from Nizamabad in the coming elections,I will quit politics" challenged Telangana deputy CLP leader Komati reddy Venkat Reddy. He accused Kavitha for not having done anything to Nizamabad. He asserted that the MP have no integrity on Nizam Sugar factory and setting up of turmeric board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X