వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరూపించండి! రాజీనామా చేస్తా, ఆ 17ని. ఏం చేశారు?: కోమటిరెడ్డి సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అసెంబ్లీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పందించారు. తాను విసిరిన హెడ్ ఫోన్ తాకి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయం అయినట్టు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి సవాల్‌ విసిరారు.

మాది భగత్ సింగ్ పోరాటం-మీది ఉగ్రవాదం!: దాడిపై కాంగ్రెస్‌ను ఏకేసిన హరీశ్, 'చర్యలు కఠినమే'మాది భగత్ సింగ్ పోరాటం-మీది ఉగ్రవాదం!: దాడిపై కాంగ్రెస్‌ను ఏకేసిన హరీశ్, 'చర్యలు కఠినమే'

 రాజీనామా చేస్తా.. ఆ 17ని. ఏం చేశారు?

రాజీనామా చేస్తా.. ఆ 17ని. ఏం చేశారు?

గాయమైనట్లు దృశ్యాల ద్వారా రుజువు చేస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి తన రాజీనామా సమర్పిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఘటన జరిగి 17 నిమిషాల తర్వాత వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి గాయమైందని చెబుతున్నారని ఆరోపించారు.

 స్పష్టత ఏదీ?

స్పష్టత ఏదీ?

గవర్నర్‌ ప్రసంగంలో దేనిపైనా స్పష్టతలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేవలం 25 నిమిషాల్లోనే ప్రసంగాన్ని గవర్నర్‌ ముగించారని, రైతుల మద్దతు ధరపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలపలేదన్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం ఉదయం కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగిన విషయం తెలిసిందే. కాగా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ తగిలి మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తగలడంతో గాయమైంది. దీంతో ఆయనను సరోజినీ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిలదీస్తాం

నిలదీస్తాం

కాగా, ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం నిరాశ కలిగించిందని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏ అంశాలపైనా స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇలావుంటే.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సభలో తమ శాసనసభాపక్షం నిలదీస్తుందని అన్నారు.

మాయ మాటలతో మోసం

మాయ మాటలతో మోసం

టీడీపీ ఎమ్మల్యేలు సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళులు ఆర్పించిన అనంతరం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. కర్షకుల కడగండ్లు తీర్చలేని కేసీఆర్‌.. మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని రమణ ఆరోపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ...శాసనసభ సమావేశాలను నడపాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం గత సమావేశాల్లో బీఎసీ సమావేశం నిర్వహించకుండానే అర్థాం

 15న బడ్జెట్.. 27వరకూ సమావేశాలు

15న బడ్జెట్.. 27వరకూ సమావేశాలు

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 27వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. మార్చి 15వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

శాసనసభలో జరిగిన ఆందోళన ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం. దాడిపై కాంగ్రెస్‌ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా జరిగిన చర్యే గానీ.. ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

English summary
Congress MLA Komatireddy Venkat Reddy on Monday said that he will resign, if chairman Swamy Goud injured in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X