వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం తీసుకొనేవాడిని చెప్పుతో కొట్టండి కెసిఆర్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగరేణిలో రేపటి నుంచి లంచం తీసుకునేవాడిని, ఇచ్చేవాడిని, ఇప్పించేవాడిని చెప్పుతో కొట్టాలి అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు 20 రోజుల్లో యాత్రను నిర్వహించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భారీ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా విపక్షాలు మూకుమ్మడిగా ఎఐటియూసికి మద్దతును ఇచ్చాయి.

అయితే సింగరేణిలోని 11 డివిజన్లలో రెండు డివిజన్లలో మాత్రమే ఎఐటియూసి విజయం సాధించింది. కానీ, మిగిలిన డివిజన్లలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది.

సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడంతో సింగరేణి కార్మికులతో తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.

లంచం తీసుకొనేవాడిని చెప్పుతో కొట్టాలి

లంచం తీసుకొనేవాడిని చెప్పుతో కొట్టాలి

సింగరేణిలో రేపటి నుంచి లంచం తీసుకునేవాడిని, ఇచ్చేవాడిని, ఇప్పించేవాడిని చెప్పుతో కొట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికులకు సూచించారు.సింగరేణి కార్మికుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించిన కార్మికులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.

20 రోజుల్లో సింగరేణి యాత్ర నిర్వహిస్తా

20 రోజుల్లో సింగరేణి యాత్ర నిర్వహిస్తా

రాబోయే 20 రోజుల్లో ‘సీఎం సింగరేణి' యాత్ర చేస్తానని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు.తానే స్వయంగా సింగరేణి కార్మికుల సమస్యలను సమీక్షిస్తానని చెప్పారు. సింగరేణి కార్మికుల దవాఖానా, క్వార్టర్స్ పరిశీలిస్తానని చెప్పారు.సింగరేణి ఆసుపత్రిలోనే బీపీ చెక్ చేయించుకుంటానని కేసీఆర్ ప్రకటించారు.

రూపాయితోనే సింగరేణిలో సభ్యత్వం

రూపాయితోనే సింగరేణిలో సభ్యత్వం

సింగరేణి కార్మిక సంఘంలో సభ్యత్వానికి కేవలం రూపాయి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పారు.ఇన్నాళ్లూ కార్మిక సంఘాల నేతలు బాగుపడ్డారని, కార్మికులు అలాగే ఉన్నారని కెసిఆర్ చెప్పారు.తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపు సింగరేణిలోని ప్రతి కార్మికుడి గెలుపు కావాలని అన్నారు.

సింగరేణి కార్మికులు క్షమించాలి

సింగరేణి కార్మికులు క్షమించాలి


సింగరేణి కార్మికులు తనను క్షమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. గతంలో ఒకసారి టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ను గెలిపించారని, సమయం లేక సింగరేణి గురించి పెద్దగా పట్టించుకోలేదని కానీ, ఈసారి మాత్రం అలా ఉండదని చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. కానీ పని జరగేలేదు.. ఇప్పుడు జరగాలని చెప్పారు.గతంలో టైం లేక శ్రద్ధ పెట్టలేదు. ఈసారి గెలిచిన గెలుపు నిజమైన కార్మికుల గెలుపుకావాలి. ఎన్నికలు గెలిసినప్పుడు సంఘాలు గెలువద్దు. కార్మికులు గెలవాలన్నారు.

English summary
I will visit Singareni soon said Telangana chief minister Kcr.Singareni employees meeting with Kcr held at Pragati Bhavan on Sunday.Telangana chiefminister Kcr sensational comments on Singareni officers on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X