వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తా... పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించని పక్షంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టే కార్యచరణకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్‌ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు. అయితే సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులు 27 రోజులుగా సమ్మెను కొనసాగించడం చాల భాధకరమని తన ఆవేదన వ్యక్తం చేసిన, సమ్మె వల్లే కార్మికులు ఎవరు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆర్టీసీ జాక్ కన్వినర్ అశ్వాథ్దామరెడ్డి మరియు ఇతర నేతలు పవన్‌ కళ్యాణ్‌ను కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్పందించారు. గత కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఇతర ప్రజాసంఘాల నేతలను కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి సమావేశం అయ్యారు.

 I would meet with CM KCR to discuss the issue of RTC stike : Pawan Kalyan

కాగా సమ్మె 27 రోజులుగా సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే... ఇప్పటికే తెలంగాణ దాదాపు అన్ని పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. సమ్మెకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు సైతం రోడ్లైపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడ సమ్మెకు మద్దతు పలికిన విషయం తెలిసిందే... అయితే నేటివరకు పవన్ కళ్యాణ్ ఆర్టీసీ సమ్మెపై ఎలాంటీ వ్యాఖ్యలు చేయలేదు.

English summary
Janasena chief Pawan Kalyan said he would meet with CM KCR to discuss the issue of RTC stike. If the CM KCR does not respond positively, will have full support he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X