వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నపుంసకుడిని, మగాడిని కాదు, బాలికలపై లైంగికదాడి ఎలా..? బైక్ నడపటం కూడా రాదు: శ్రీనివాస్‌ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా.. బాలికలను బైక్‌పై తీసుకెళ్లి, లైంగికదాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు 101 మంది సాక్షుల నుంచి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ కేసు నల్గొండ జిల్లా మొదటి అదనపు కోర్టు విచారణ జరుగుతుండగా.. న్యాయమూర్తితో తనకేం తెలియదని, అమాయకుడినని బిల్డప్ ఇచ్చాడు సైకో శ్రీను. శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి, నిందితుడి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం

పోర్న్ వీడియోలు..

పోర్న్ వీడియోలు..

మొబైల్‌లో ఆశ్లీల సినిమాలు, బొమ్మలు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఏసీపీ భుజంగరావు వీక్షించి న్యాయస్థానానికి చెప్పారని మేజిస్ట్రేట్.. శ్రీనివాస్‌ని అడిగారు. అయితే తనకు స్మార్మ్ ఫోన్ లేదని తెలివిగా తప్పించుకున్నాని శ్రీనివాస్ అనుకొన్నాడు. తర్వాత మృతురాలి వస్త్రాలపై స్పెర్మ్ ఉన్నాయని, అవి నీవేనని రుజువయ్యాయని ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చిందని ప్రశ్నించారు. తనను పోలీసులు నిర్బంధించి బలవంతంగా సిరంజి ద్వారా సేకరించారని పేర్కొన్నారు. దానినే వారి దుస్తులపై చల్లి ఉంటారని తింగర సమాధానం ఇచ్చాడు.

మగాడిని కాదు..

మగాడిని కాదు..

ఇద్దరు బాలికలను బైక్‌పై తీసుకెళ్లి లైంగికదాడితోపాటు హత్య చేసి బావిలో పూడ్చివేసినట్టు ఆరోపణలు ఉన్నాయని అని ప్రశ్నిస్తే.. తాను నపుంసకుడినని చెప్పి న్యాయమూర్తినే విస్మయానికి గురిచేశాడు. అలాంటప్పుడు లైంగికదాడి ఎలా చేస్తానని ప్రశ్నించాడు. అంతేకాదు తనకు బైక్ నడపడమే రాదని చెప్పాడు. ఇద్దరిపై లైంగికదాడి చేసి, బావిలో పూడ్చిపెట్టినట్టు సాక్షుల ముందు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారని న్యాయమూర్తి ప్రస్తావించగా.. అంతా అబద్ధమని సైకో శ్రీను కొట్టిపారేశాడు.

48 పనిదినాల్లో విచారణ

48 పనిదినాల్లో విచారణ

ఈ కేసులో వాదోపవాదనల తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. సాక్షుల వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ నివేదికను కూడా కోర్టుకు అందజేశారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి 48 పనిదినాల్లో కేసు విచారణ కొనసాగింది.

సంక్రాంతి లోపే తీర్పు

సంక్రాంతి లోపే తీర్పు


హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను సైకో శ్రీనివాస్ రెడ్డి బైక్‌పై ఎక్కించుకొని.. తీసుకెళ్లేవాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసులో వాదోప వాదనలు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం రోజు జరిగే వాదనలతో.. తీర్పుపై క్లారిటీ వస్తోంది. సంక్రాంతి లోపు న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

English summary
iam a third gender, how to rape girl srinivas reddy ask to magistrate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X