హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలనం: డ్రగ్స్‌ కేసులో నలుగురు బడాబాబుల కుమారులు

డ్రగ్స్‌ దందాలో మరో సంచలనం. ఈ మాదక ద్రవ్యాల రాకెట్‌లో కొంతమంది బడాబాబుల కుమారులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ ఐఏఎస్‌ అధికారి, డాక్టర్‌, బడా కంపెనీ డైరెక్టర్‌, స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుమారులుగా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డ్రగ్స్‌ దందాలో మరో సంచలనం. మాదక ద్రవ్యాల రాకెట్‌లో కొంతమంది బడాబాబుల కుమారులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

ఓ ఐఏఎస్‌ అధికారి, డాక్టర్‌, బడా కంపెనీ డైరెక్టర్‌, స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుమారులుగా వీరిని గుర్తించారు. వీరంతా ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివినట్టు తెలుస్తోంది. కెల్విన్‌తో వీరికి సంబంధాలున్నట్టు సమాచారం. కెల్విన్‌ సృష్టించిన డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీరు తమ ఇంటి అడ్రస్‌లకు డ్రగ్స్‌ తెప్పించుకున్నట్టు తెలిసింది.

IAS officer kid among 4 students of Hyd Int’l school arrested in drugs case

ఐఏఎస్ కుమారుడు ఎల్ఎస్డీకి బానిసగా మారాడని కూడా అధికారులు గుర్తించారు. కొరియర్ సర్వీసు ద్వారా అతను ఎల్ఎస్డీని తెప్పించుకునేవాడని దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటికి నాలుగుసార్లు అతను ఎల్ఎస్డీని తెప్పించుకున్న ఆధారాలను కూడా వారు సంపాదించారు.

మరోవైపు ఈ నలుగురు విద్యార్థులకు తరచూ తాను డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసుల విచారణలో డ్రగ్ డీలర్ కెల్విన్‌ కూడా వెల్లడించినట్టు తెలిసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే ఈ నలుగురు విద్యార్థులను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించినట్టు సమాచారం.

అయితే ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు మాత్రం దీనిపై అధికారికంగా సమాచారం వెల్లడించడంలేదు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదువుతున్న వారిలో చాలా మంది విద్యార్థులు కెల్విన్‌కు రెగ్యులర్‌ కస్టమర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమకు చెందిన వారిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు సిట్‌ ఎదుట విచారణకు హాజరవగా, ఈ కేసులో విచారణ కోసం నటుడు సుబ్బరాజును కూడా శుక్రవారం ఉదయం నాంపల్లిలోని సిట్‌ అధికారుల కార్యాలయానికి చేరుకున్నారు.

English summary
The Excise SIT officials arrested four students for consuming drugs. They found students were studying in an international school and they were addicted to drugs. They are placing an order for banned drugs through the dark website and getting them through courier service. One of the students is a son of IAS officer. The SIT officials found evidence that son of IAS officer procured drugs and supplied to three of his friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X