హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీగా ఐఎఎస్ బదిలీలు: సోమేష్ కుమార్‌కు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసింది. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సోమేశ్‌పై వచ్చిన ఆరోపణలు జాతీయ స్థాయికి చేరాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఇప్పటికే రాష్ట్రంలో విచారణ చేపడుతోంది. అఖిలపక్షంతో శనివారం ఈ బృందం సమావేశం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా జనార్దన్‌ రెడ్డిని నియమించింది.

Somesh Kumar

జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లుగా ఉన్న నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ, వారి స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. సోమేశ్‌ కుమార్‌తోపాటు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒక ఐఆర్‌ఎస్‌ సహా 22 మంది ఐఏఎస్‌లను బది లీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు ఈసారి బదిలీ జాబితాలో చేర డం గమనార్హం. పంచాయతీరాజ్‌ మంత్రి కేటీఆర్‌ శాఖల పరిధిలోనే ఈసారి ఎక్కువగా బదిలీలు జరిగా యి. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రేమండ్‌ పీటర్‌ను సీసీఎల్‌ఏగా నియమించారు.

English summary
GHMC commissioner Somesh Kumar has been shifted to tribal welfare department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X