వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ నేతలకు దమ్ముంటే రేల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించండి : ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

|
Google Oneindia TeluguNews

బీజేపీకి చేతనైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెప్పించడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ఇది కర్ణాటక గుర్తుంచుకుంటే మంచిందని ఆయన హితవు పలికారు.రాజకీయ కుట్రలతో టిఆర్ఎస్ బలాన్ని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడీయా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ క్యాడర్ లేని బీజేపీ కుట్రలకు తెరలేపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రలను ఎలా తిప్పికొట్టాలో టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌‌తో పాటు టీఆర్ఎస్ క్యాడర్‌కు తెలుసని ఆయన అన్నారు.బీజేపీ నాయకులు ముందుగా ఇది కర్ణాటక రాష్ట్రం కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.తెలంగాణకు నెలకో మంత్రిని పంపిస్తానని చెబుతున్న అమిత్ మంత్రులు వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటీ అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారో తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు.

if bjp leaders have guts, bring a railway coach factory :TRS MLA Vinay Bhaskar

బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవగానే మొత్తం రాజకీయాలు తమకు అనుకూలంగా ఉన్నాయని గొప్పలు చెప్పిన వాళ్లు ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు ఆ పార్టీని ప్రజలు గుర్తించలేదని అన్నారు. ఏ పార్టీ ఎన్ని కుట్రుల చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని ప్రజల్లో స్పష్టమైన విశ్వాసం ఉందని ఆయన పేర్కొంటూ వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో కచ్చితంగా అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కుట్రలతో తెలంగాణను అభాసు పాలు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

English summary
TRS MLA government whip Vinay Bhaskar has demanded BJP leaders that if they have guts to bring a railway coach factory for the telangana. He said that the BJP leaders would remember telangana is not Karnataka. He was speaking at a media conference in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X