వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్‌కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

'6ఏళ్లలో 60 వైఫల్యాలు' పేరుతో టీఆర్ఎస్ పై చార్జిషీటు విడుదల చేసిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో దూసుకెళుతోన్న తెలంగాణకు బీజేపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని, దేశానికి వెన్నెముక లాంటి 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన నేరానికి బీజేపీపైనే చార్జిషీటు వేయాల్సి ఉందని గౌడ్ మండిపడ్డారు.

Recommended Video

GHMC Elections: కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం

పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనంపేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనం

 జవదేకర్‌కు కౌంటర్

జవదేకర్‌కు కౌంటర్

టీఆర్ఎస్ పై చార్జిషీటు పేరుతో బుక్ లెడ్ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్.. సీఎం కేసీఆర్ ను ఉద్దించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఫ్యామిలీ ఆస్తులను పెంచుకుంటున్నారని ఆరోపించారు. వీటికి శ్రీనివాస్ గౌడ్ కౌంటరిస్తూ.. నిజంగా చేసిన తప్పులకు చార్జిషీట్ వేయాల్సి వస్తే బీజేపీనే తొలి దోషిగా ఉంటుందని, దేశంలో 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన బీజేపీ.. పొరపాటున గెలిస్తే హైదరాబాద్ ను అంబానీకి అమ్మేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

మోదీ పొడిడిన సంగతి మర్చారా?

మోదీ పొడిడిన సంగతి మర్చారా?

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, పరిపాలనా విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచి నిన్నటికి నిన్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి దాకా పొగడ్తలు కురిపించిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గుర్తుచేశారు. అయితే ఎన్నికలు రాగానే ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా తిరిగి అదే బీజేపీ నేతలు మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ కు ఎంఐఎం మేయర్ కావాలా? అంటూ జవదేకర్‌ అడుగుతున్నారని, అసలు బీజేపీ విధానామే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాల్చుకోవడమని మంత్రి మండిపడ్డారు.

 బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి..

బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి..

‘‘మరోవైపు తెలంగాణకు సహకరించామంటూనే అక్రమంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. ఆరేళ్లలో తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. కేంద్రం సహకారం లేకున్నా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ఓర్వలేకపోతున్న బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. చార్జిషీటు వేయాల్సి వస్తే బీజేపీపైనే వేయాలి. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, రైల్వే తదితర 26 సంస్థలను ప్రైవేటుపరం చేసినందుకు బీజేపీపైనే చార్జిషీటు వేయాలి'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కేసీఆర్‌తో ఓవైసీ ఢీ:గ్రేటర్‌లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?కేసీఆర్‌తో ఓవైసీ ఢీ:గ్రేటర్‌లో పొత్తులేదు -బీజేపీ నేతలకు నిద్రలోనూ నా పేరే -సిటీకి మోడీ ఏమిచ్చాడు?

English summary
Poonam Pandey was asked that i want to know ur mobile number... plz dear
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X