వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుస్నాబాద్ స‌భ విజ‌య‌వంతం ఐతే కేటీఆర్ కి త‌ల‌వంపులే..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: కొంగ‌ర్ క‌లాన్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌.. ఇప్పుడ‌ది ముగిసిన అద్యాయం. ఆ స‌భ విజ‌యం సాదించిందా లేదా అన్న‌ది ఇప్పుడు అప్ర‌స్తుతం. గ‌తాన్ని త‌లుచుకుని వ‌గ‌చి వ‌గ‌చి విల‌పించేక‌న్నా భ‌విశ్య‌త్తుపై భ‌రోసాతో అడుగుముందుకు వేయ‌డం ఉత్త‌మ‌మ‌ని గులాబీ నేత‌లు భావిస్తున్నారు. ఐతే వేలాది మంది తెలంగాణ ప్ర‌జానికంతో మ‌రో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసి కొంగ‌ర్ క‌లాన్ స‌భ చేసిన గాయం నుండి తేరుకోవాల‌ని గులాబీ ద‌ళం స‌న్నాహాలు చేస్తోంది. సాద్య‌మైనంత తొంద‌ర‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ద్వారా కేసీఆర్ అస‌మ‌ర్ధ‌త బ‌హిర్గ‌త‌మైంద‌నే అప‌వాదును తొల‌గించుకోవాల‌ని టీఆర్ఎస్ ముఖ్య నేత‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

బావా బామ్మ‌రుదుల స‌వాల్ గా మారిన స‌భ‌లు..! హ‌రీష్, కేటీఆర్ ల మ‌ద్య గ‌ట్టి పోటీ..!!

బావా బామ్మ‌రుదుల స‌వాల్ గా మారిన స‌భ‌లు..! హ‌రీష్, కేటీఆర్ ల మ‌ద్య గ‌ట్టి పోటీ..!!

ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి ప్ర‌తిప‌క్షాల నోళ్ల‌కు తాళం వేయాల‌ని కూడా టీఆర్ఎస్ నాయ‌కులు పావులు క‌దుపుతున్నారు. అంతే కాకుండా ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ద్వారా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అప‌వాదును కూడా క‌డిగేసుకోవాల‌ని గులాబీ నేత చంద్ర‌శేఖ‌ర్ రావు ప్న‌ణాళిక రచిస్తున్నారు. అందుకు కొడుకు కేటీఆర్ ను కాకుండా అల్లుడు హ‌రీష్ ను రంగంలోకి దించుతున్నారు. ఇంత వ‌ర‌కూ కథ క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం బాగానే ఉన్నా గులాబీ పార్టీలో ఇక్క‌డో ఊహించ‌ని భారీ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. అందేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

అటు అల్లుడు.. ఇటు త‌న‌యుడు.. మ‌ద్య‌లో న‌లుగుతున్న గులాబీ బాస్..!!

అటు అల్లుడు.. ఇటు త‌న‌యుడు.. మ‌ద్య‌లో న‌లుగుతున్న గులాబీ బాస్..!!

హుస్నాబాద్ ఆశిర్వాద స‌భ నిర్వ‌హ‌ణ బాద్య‌త‌లు మొత్తం మంత్రి హ‌రీశ్ రావు త‌న బుజాల మీద వేసుకున్నారు.వేదిక, జ‌న‌స‌మీక‌ర‌ణ‌, సౌక‌ర్యాలు, స‌భ‌ విజ‌య‌వంతం అన్నీ తానై నిర్వ‌హిస్తున్నారు. కొంగ‌ర క‌లాన్ స‌భ ఎలా జ‌రుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాల ప‌ట్ల హ‌రీష్ రావు ఇసుమంతైనా ద్రుష్టి కేంద్రీకరించ‌క‌పోబ‌ట్టే స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అయిన‌ట్టు వార్త‌లు ఘుప్పుమ‌న్నాయి. దీంతో హుస్నాబాద్ స‌భ బాద్య‌త‌ల‌ను మొత్తం హ‌రీష్ చూసుకుంటున్నారు. ఐతే కొంగ‌రక‌లాన్ స‌భ ఫెయిల్ కావ‌డంతో బాద్య‌త‌లు నిర్వ‌హించిన మంత్రి కేటీఆర్ పైన దాని ప్రభావం పూర్తిగా ప‌ని చేసింది.

హ‌రీష్ అనుభ‌వం ముందు కేటీఆర్ త‌క్కువే..! అందుకు కొంగ‌ర్ క‌లాన్ ఉదాహ‌ర‌ణ‌..!

హ‌రీష్ అనుభ‌వం ముందు కేటీఆర్ త‌క్కువే..! అందుకు కొంగ‌ర్ క‌లాన్ ఉదాహ‌ర‌ణ‌..!

ముఖ్యంగా జ‌న స‌మీక‌ర‌ణ అంశంలో కేటీఆర్ ఘోరంగా విఫ‌లం చెందార‌ని, స‌భ స‌క్సెస్ చేయ‌డ‌మంటే ట్వీట్ చేసినంత సుల‌భం కాద‌ని గులాబీ పార్టీలోనే కెటీఆర్ ను టార్గెట్ చేస్తూ పెద్ద చ‌ర్చ జ‌రిగింది. రేపు ఏడ‌వ తారీఖులు ఆశీర్వాద స‌భ విజ‌య‌వంతం ఐతే మాత్రం కెటీఆర్ కొంత‌వ‌ర‌కు ఆత్మ‌న్యూన‌తా భావానికి గురికాక త‌ప్ప‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌బ్లిక్ మేనేజ్ మెంట్ లో గాని, పోల్ మేనేజ్ మెంట్ లో గాని హ‌రీష్ రావు కు మంచి ప‌ట్టుంద‌ని, తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌త్యేక క్యాడ‌ర్ పెద్ద‌యెత్తున హ‌రీష్ కోసం ప‌నిచేస్తుంటుంద‌నే టాక్ వినిపిస్తోంది.

భంగ‌పాటు కేటీఆర్ కే..!

భంగ‌పాటు కేటీఆర్ కే..!

అందుకే హ‌రీష్ తెలంగాణ‌లో ఏ మూల‌న కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టినా అది బ్లాక్ బ‌స్ట‌ర్ కావిల్సిందే త‌ప్ప ఫెయిల్ అవ్వ‌ద‌నే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. కేటీఆర్ కు ఇంకా హ‌రీష్ రావును అందుకునే స్థాయి రాలేద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. రేపు హుస్న‌బాద్ స‌భ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత హ‌రీష్ ప‌రిప‌క్వ‌త, కెటీఆర్ ప‌రిప‌క్వ‌త బేరీజువేసుకునే వెసులు బాలు ఉంటుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి బావ బావ‌మ‌రుదుల రాజ‌కీయ క్రీడ‌లో ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మౌతోంది.

English summary
telangana cm kcr is planning to go pre elections in telangana. that's why he is conducting public meeting. few days back pragathi nivedana sabha which was organised by ktr became utter flap. now again kcr planning for one more meeting in siddipeta district husnabad. but now the entire responsibility taking minister mr hareesh rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X