వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో జ'గన్'! కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రమ్మంటున్న కేసీఆర్.. వద్దంటున్నటీ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. జూన్ 17న విజయవాడ వెళ్లి మరీ జగన్ ను ఆహ్వానించనున్నారు సీఎం కేసీఆర్ . అయితే జగన్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే తన తండ్రిని తప్పుపట్టినట్టే అని మెలిక పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క .

8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావుల8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావుల

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే జగన్ తన తండ్రి జలయజ్ఞాన్ని తప్పు పట్టినట్టే అన్న భట్టి

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే జగన్ తన తండ్రి జలయజ్ఞాన్ని తప్పు పట్టినట్టే అన్న భట్టి

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని సూచన ప్రాయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ చొరవ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహబంధం బలపడాలనేకేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారని ఇక అలాంటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వస్తారని భట్టి అంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తన తండ్రి వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని తప్పుబట్టినట్టేనని, ఆయనను అవమానించినట్టేనని భట్టి స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ డీపీఆర్ శాసన సభలో పెట్టలేదన్న భట్టి .. రాష్ట్రంలో నేతలు కనపడట్లేదు అంటూ ఆగ్రహం

ప్రాజెక్ట్ డీపీఆర్ శాసన సభలో పెట్టలేదన్న భట్టి .. రాష్ట్రంలో నేతలు కనపడట్లేదు అంటూ ఆగ్రహం

ప్రాజెక్టు టెండర్లు ఇరిగేషన్ వెబ్ సైట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు సంబంధిండిన డీపీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రయోజనాల కంటే కూడా కుటంబ ప్రయోజానాలకే పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న నేతలు కనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు భట్టివిక్రమార్క. ఇక కాళేశ్వరం డీపీఆర్ ను ఇంతవరకు శాసనసభలో ప్రవేశపెట్టలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్న భట్టి

పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్న భట్టి

అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ చాలా స్పష్టత ఇచ్చారని, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఉన్నాయని పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక జగన్ ను చూసినా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు.తమ అవినీతిపై ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభానికి జగన్ వస్తే వైఎస్సార్ చేసిన ప్రాణహిత తప్పని ఒప్పుకున్నట్టు అవుతుందన్నారు భట్టి.

English summary
YS Rajasekhar Reddy, who was planned to construct pranahitha chevella .TRS government changed the name as Kalaeswaram project and re designed the pranahitha chevella. How jagan will come to the project opening ceremony asked the congress leader Bhatti Vikramarka . if Jagan comes to the opening ceremony of the Kaleshwaram project, that is nothing but a insult to his father, YSR, was wrong and his jalayagnam also wrong .The project tender demanded to kept on the irrigation website. Demanded that the DPR relate to the Seetharama project and also kaleshwaram project .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X