వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్, ఎంజీఆర్ శకం చూస్తామా?: 'పవన్, కమల్ హాసన్‌లు సీఎంలు అయితే'

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమిళనాట ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన నటుడు కమల్ హాసన్‌కు సినిమా తారల నుంచి మద్దతు పెరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమిళనాట ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన నటుడు కమల్ హాసన్‌కు సినిమా తారల నుంచి మద్దతు పెరుగుతోంది.

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు, వారికి షాక్: సుప్రీం ఓకే, ఆళ్ల ఏమన్నారంటేఓటుకు నోటు కేసులో కీలక మలుపు, వారికి షాక్: సుప్రీం ఓకే, ఆళ్ల ఏమన్నారంటే

 పవన్ కళ్యాణ్, కమల్ హాసన్‌లకు మద్దతు

పవన్ కళ్యాణ్, కమల్ హాసన్‌లకు మద్దతు

ఇప్పటికే పవన్ స్థాపించిన జనసేనకు తారల మద్దతు లభిస్తోంది. ఆయన పార్టీని బలోపేతం చేసి, ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆయన వెంట మరింతమంది ఆయన వెంట నడిచే అవకాశాలు లేకపోలేదు.

 రాజకీయాల్లోకి వచ్చేశారు

రాజకీయాల్లోకి వచ్చేశారు

మరోవైపు, కమల్ హాసన్ పార్టీ పెడుతున్నారు. ఆయన పార్టీ పెడితే తమిళనాట ఆయన వెంట నడిచేందుకు కూడా తారలు, ఇతర పార్టీలలోని నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మంగళవారం ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చేశానని స్పష్టం చేశారు.

 రజనీకాంత్ పైన ప్రచారం జరిగినా

రజనీకాంత్ పైన ప్రచారం జరిగినా

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, తమిళనాట కమల్ హాసన్, రజనీకాంత్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఈ ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. పవన్ ఇప్పటికే పార్టీ స్థాపించారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేశారు.

 ఇద్దరు సీఎంలు అయితే

ఇద్దరు సీఎంలు అయితే

ఈ నేపథ్యంలో తెలుగు సినీ నటుడు నరేష్ స్పందించారు. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్‌లు ముఖ్యమంత్రులు అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లక్షల మంది అభిమానులు, ప్రజలు... పవన్, కమల్‌లు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, అదే జరిగితే అప్పటి ఎన్టీఆర్, ఎంజీఆర్‍‌ల శకాన్ని మళ్లీ చూడవచ్చునని ట్వీట్ చేశారు.

English summary
Many movie personalities are supporting Jana Sena chief Pawan Kalyan in Telugu States and Kamal Hassan in Tamil Nadu in political view.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X