వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. ఆ మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా: శంకరమ్మ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా

హైదరాబాద్‌: తనకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ నేత శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

ఈ ఆనందంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది: హరీశ్ భావోద్వేగం, ఆసక్తికర వ్యాఖ్యలుఈ ఆనందంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది: హరీశ్ భావోద్వేగం, ఆసక్తికర వ్యాఖ్యలు

శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుంటే మంత్రిపై సూసైడ్‌ నోటు రాసుకుని ఎల్బీ నగర్‌ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని శంకరమ్మ తేల్చి చెప్పారు.

If MLA ticket not given to me, i will suicide, says shankaramma

హుజూర్‌నగర్‌ టికెట్‌ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు.

ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్‌నగర్‌ సీటును కేటాయించాలని శంకరమ్మ కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు. పార్టీ అధిష్టానం తనకు కేటాయిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

English summary
If MLA ticket not given to me, i will suicide, says Srikantha Chary's mother Shankaramma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X