• search
 • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దుబ్బాక : మోదీ కన్నెర్ర చేస్తే జైల్లో ఉంటారు... కేసీఆర్,హరీశ్‌లకు బాబు మోహన్ హెచ్చరిక...

|

దుబ్బాక ఉపఎన్నికకు గట్టిగా మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు దగ్గరబడుతున్నకొద్ది నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా సోమవారం(అక్టోబర్ 26) చోటు చేసుకున్న పరిణామాలు టీఆర్ఎస్-బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను కల్పించాయి. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు,ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు... ఆపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో ఆ పార్టీ శ్రేణులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ బండి సంజయ్‌పై దాడి చేశారని ఆరోపిస్తున్నాయి. ఓటమి భయంతోనే అధికారులను,పోలీసులను తమపైకి ఉసిగొల్పుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై తాజాగా బీజేపీ నేత బాబూ మోహన్ మీడియాతో మాట్లాడారు.

హరీశ్ రావు వల్లే అలజడి : బాబు మోహన్

హరీశ్ రావు వల్లే అలజడి : బాబు మోహన్

దుబ్బాకలో యువత అంతా బీజేపీ వెంటే ఉన్నారని బాబు మోహన్ పేర్కొన్నారు. విద్యావంతులు,నిరుద్యోగులంతా బీజేపీనే గెలిపిస్తామని చెప్తుండటంతో టీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నాయని విమర్శించారు. దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పబోతున్నారన్న విషయం గ్రహించే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దుబ్బాకలో ఓడిపోతే మున్ముందు రాష్ట్రంలో టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందన్నారు. మంత్రి హరీశ్ రావును దుబ్బాక నియోజకవర్గాన్ని వీడితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయన్నారు. ఆయన వల్లే నియోజకవర్గంలో అలజడి రేగుతోందని... ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

మోదీ కన్నెర్ర చేస్తే జైలుకే...

మోదీ కన్నెర్ర చేస్తే జైలుకే...

దుబ్బాక పక్కనే ఉన్న సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాలు ఎలా అభివృద్ది చెందాయి.. దుబ్బాక పట్టణం మాత్రం ఎందుకు వెనుకబడిపోయిందని బాబు మోహన్ ప్రశ్నించారు. రోడ్లు,కనీస వసతులు కూడా కల్పించలేని దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. విద్యావంతుడు,న్యాయవాది,తెలంగాణ ముద్దుబిడ్డ రఘునందన్ రావు ప్రభుత్వ కుట్రలు దుర్మార్గం అన్నారు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్‌ను ఓడించేందుకు సిద్దంగా ఉందన్నారు. కాబట్టే మామా అల్లుళ్లకు భయం పట్టుకుందన్నారు. తమ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని.. ఆయన గనుక కన్నెర్ర చేస్తే జైల్లో ఉంటారని హెచ్చరించారు.

బండి సంజయ్‌కి డీకే అరుణ పరామర్శ..

బండి సంజయ్‌కి డీకే అరుణ పరామర్శ..

సిద్దిపేట సీపీ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సీపీని తక్షణం సస్పెండ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ దీక్ష నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య అన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పోలీసులను దాడులకు ఉసిగొల్పుతోందన్నారు. దుబ్బాక ప్రజలు ఇప్పటికే టీఆర్ఎస్‌ను ఓడించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

  #HyderabadRains : CM KCR Announces Rs 550 Crore Package For Flood Relief Operations
  అల్లున్ని ముందు పెట్టి...

  అల్లున్ని ముందు పెట్టి...


  అల్లుడు హరీశ్ రావును ముందుపెట్టి కేసీఆర్ వెనకనుండి అంతా నడిపిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. చీటికి మాటికి కేంద్రం మీద ఏడవడం తప్పితే రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని హరీశ్ రావును డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి హరీశ్ రావులకు అబద్దాలు చెప్పడంలో డాక్టరేట్లు ఇవ్వవచ్చునని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయమన్నారు.

  English summary
  Former Minister,BJP leader Babu Mohan warned CM KCR and Minister Harish Rao that if PM Modi gets anger they will be send to jail.He talked to media regarding the searches in Raghunandan Rao's house and allegations over attack on Bandi Sanjay
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X