raja singh bjp telugu desam tdp revanth reddy telangana cm candidate hyderabad టిడిపి తెలుగుదేశం బిజెపి రేవంత్ రెడ్డి రాజాసింగ్
రేవంత్ మా పార్టీ సిఎం అభ్యర్థి, బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
హైదరాబాద్:టిడిపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బిజెపిలో చేరితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుండి రేవంత్ రెడ్డి సిఎం అభ్యర్థి అవుతారని చెప్పారు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. ఆయన బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది.అయితే ఈ ప్రచారాలను రేవంత్ ఖండించారు. అయితే తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

బిజెపిలో రేవంత్ రెడ్డి చేరితే 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సిఎం అభ్యర్థి అవుతారని రాజాసింగ్ చెప్పారు.శనివారం నాడు అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు సిఎంకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదన్నారు. రెండు రోజుల పాటు సిఎం క్యాంప్ ఆఫీసు ముందే కూర్చొంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.