వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా ఐతే కేసీఆర్ కి గుడి కట్టిస్తా..! జగ్గారెడ్డి మరో సంచలన ప్రకటన..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనాల కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరో సంచలన ప్రకటన చేసారు. తాను నిత్యం విమర్శించే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన సానుకూలత ద్రుక్పదాన్ని వ్యక్తం చేసారు. అంతే కాదు ఏకంగా గుడి కట్టించి నిత్యారాధనలు, పూజలు, హోమాలు నిర్వహిస్తానని బహిరంగంగా ప్రకటించారు. రైతు పండించిన పంటలో ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కలిపించే విధంగా ప్రణాళిక రూపొందించేందుకు చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జగ్గా రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఒక సంవత్సరం లో అమలు చేస్తే సంగారెడ్డి లో చంద్రశేఖర్ రావుకు గుడి కట్టిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీ కి కూడా గుడి కట్టిస్తా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినందుకే చంద్రశేఖర్ రావు సీఎం అయ్యారు.. ఈ పధకం తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తున్నారు. ఈ పధకం లో చంద్రశేఖర్ రావు సక్సెస్ కావాలని దేవుడిని, ప్రకృతిని కోరుకుంటున్నానని తెలిపారు. నల్గొండ, భువనగిరి, మల్కాజ్ గిరి, ఖమ్మం, చేవెళ్ళ గెలిచే స్థానాలని, పెద్దపల్లి, జహీరాబాద్ గెలిచినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి తెలిపారు.

If so,will build the kcr temple.!Jaggareddi is another sensational announcement..!!

ప్రజల్లో చాలా పెద్ద మార్పు వచ్చిందని, మైనారిటీ లు, క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, రాహుల్ ప్రకటించిన నెలకు 6 వేల స్కీం పూర్తి స్థాయిలో ప్రజలోకి ఇంకా వెళ్లలేదని, వెళ్లి ఉండి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని అన్నారు. రాష్ట్రం లో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారని, అవినీతి జరగని శాఖ ఏదైనా ఉందా ..!. అవినీతి చేయని నాయకులు ఎవరైనా ఉన్నారా ..? తెలంగాణలో అవినీతిని నీర్మూలించడం ఎవరితరం కాదని జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు.

English summary
Jagga Reddy said he welcomed the decision taken by Chandrasekhar Rao to create a plan for the government to pay the price of each grain in the crop grown crop. This decision was made in a year and made sensational comments on the temple of Chandrasekhar Rao in Sangarreddi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X