వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ ఆదేశిస్తేనే చర్చలు : కేకే

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రస్తావన తీసుకువచ్చిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు సమ్మెపై మరోసారి స్పందించారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే కార్మికులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు సీఎం కేసీఆర్ నుండి ఎలాంటీ పిలుపు రాలేదని చెప్పారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడ తనను సంప్రదించలేదని చెప్పారు. సమ్మెపై సీఎం ఆదేశిస్తేనే చర్చలకు వెళతానని అన్నారు.

ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అయితే ఆర్టీసీ కార్మికులు ఇద్దరు చనిపోయారనే బాధతోనే చర్చల ద్వార పరిష్కారం సాధించుకోవాలని సూచించినట్టు ఆయన తెలిపారు. సమ్మెపై ఒక సీనియర్ పార్టీ నేతగానే స్పందించాను తప్ప ప్రభుత్వ ఆదేశాలతో కాదని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె చేజారిపోతుందనే నేపథ్యంలో కేకే సమ్మెను విరమించాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహింపచేసి సమ్మెను విరమింప చేయాలని భావిస్తున్నట్టు పలువురు రాజకీయ నాయకులతోపాటు ,ఆర్టీసీ జేఏసీ నాయకులు భావించారు. దీంతో చర్చలు కొనసాగి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించారు.

If the cm kcr ordered i would involve in the rtc Strike: KK

కాగా కేకే బహిరంగ లేఖ రాసిన అనంతరం ఆర్టీసి కార్మికులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో సహకరించిన కేకే అంటే తమకు ఎంతో అభిమానం ఉందని ఆయన మధ్యవర్తిత్వంలో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని జేఏసీ కన్వినర్ అశ్వాథ్ధామ రెడ్డి ప్రకటించారు. అయితే కేకే లేఖ విడుదల చేసి ఇరవైనాలుగు గంటలు గడుస్తున్నా.. అటు సీఎంతోపాటు ఇటు సీఎం కూడ ఎలాంటీ సంప్రదింపులు జరగకపోవడంతో కేకే మరోసారి సమ్మెపై వివరణ ఇచ్చారు.

English summary
If the cm kcr ordered i would involve in the rtc Strike issue, Trs senior leaderk keshavarao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X