వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం విద్యుత్ కేంద్ర ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ప్రమాదమా..? కుట్ర అంటూ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రం లోపల 9 మంది ఉండటంతో సింగరేణి సిబ్బంది సాయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగింది ప్రమాదమా అంటూ ప్రశ్నించారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

విద్యుత్ కేంద్రంలో లోపల గదులు.. అందులో ఉంటే సేఫ్: గువ్వల బాలరాజు, ప్రమాదంపై సీఎం దిగ్బ్రాంతి..విద్యుత్ కేంద్రంలో లోపల గదులు.. అందులో ఉంటే సేఫ్: గువ్వల బాలరాజు, ప్రమాదంపై సీఎం దిగ్బ్రాంతి..

ప్రమాదంపై అనుమానం

ప్రమాదంపై అనుమానం

విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ప్రమాదం జరిగిందా.? లేదంటే కుట్ర జరిగిందా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ జల దోపిడీకి హెల్ప్ చేస్తుండటం వల్లే ఘటన జరిగిందా అని అడిగారు. పరిస్థితిని బట్టి చూస్తే విద్యుత్ ప్రాజెక్టులను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిని ఇదివరకే తాము చెప్పామని వివరించారు. జరిగిన కుట్రను ప్రమాదం పేరుతో కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సీబీఐతో విచారణ

సీబీఐతో విచారణ


ప్రమాదంపై నిజ నిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే జరిగింది.. ప్రమాదమో, కుట్ర తెలుస్తోందని చెప్పారు. రేవంత్ ఆరోపణలపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించాల్సి ఉంది. కానీ ప్రమాదంలో 9 మంది ఇంకా బయటకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఆరోపణలు ఏంటీ అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

Recommended Video

AP CM YS Jagan Orders To Officials, గోదావరి వరద బాధితులకు జగన్ చేయూత
9 మంది లోపలే

9 మంది లోపలే

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంతో 8 మందిని బయటకు తీశారు. 9 మంది లోపలే ఉన్నారు. వఅరిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది కాగా ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌, ఆమ్రాన్‌ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ లోపల ఉన్నారు. బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారని.. ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
if this accident or conspiracy, congress mp revanth reddy doubted srisailam power house accident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X