వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ చేయలేను: కొడంగల్‌పై టీఆర్ఎస్ ఇంచార్జ్, రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం

రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.

షాకింగ్: రేవంత్ ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఆరా, భేటీకి టీఆర్ఎస్ నేతషాకింగ్: రేవంత్ ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఆరా, భేటీకి టీఆర్ఎస్ నేత

Recommended Video

Revanth Reddy has praised Sonia Gandhi కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ | Oneindia Telugu

మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గుర్నాథ్ రెడ్డిని రంగంలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గుర్నాథ్ రెడ్డి మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది.

రేవంత్‌కు షాక్: ఆ కీలక నేతలు యూటర్న్, రాహుల్‌కు లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్రేవంత్‌కు షాక్: ఆ కీలక నేతలు యూటర్న్, రాహుల్‌కు లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్

కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తే

కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తే

కొడంగల్ ఉప ఎన్నిక వస్తే పోటీ తీవ్రంగా ఉంటుందని, తాను ఇప్పటికే పదిసార్లు పోటీ చేశానని, ఇప్పుడు పోటీ చేసేందుకు తన వయసు సహకరించదని గుర్నాథ్ రెడ్డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

రంగంలోకి తనయుడు, నంద్యాల వలె

రంగంలోకి తనయుడు, నంద్యాల వలె

తమ అబ్బాయిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నానని, తన కుమారుడికి ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీగా పని చేసిన అనుభవం ఉందని, అయితే అభ్యర్థి ఎవరనే విషయాన్ని అధినేత కేసీఆరే ఖరారు చేస్తారని, టికెట్ కోసం చాలామంది పోటీలో ఉన్నారని, ఎన్నిక ఏకపక్షంగా అయితే ఉండదని, నంద్యాల మాదిరి ఇక్కడ కూడా ధనప్రవాహం ఉంటుందని గుర్నాథరెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి బాటలోనే కంచర్ల భూపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి బాటలోనే కంచర్ల భూపాల్ రెడ్డి

టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా, దానిని జీర్ణించుకోలేక కంచర్ల భూపాల్ రెడ్డి కంటతడి, మోత్కుపల్లిపై పరోక్ష విమర్శలు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు రమణ షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. భూపాల్ రెడ్డి.. రేవంత్ బాటలోనే నడవనున్నారు.

రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దగ్ధం

రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దగ్ధం

కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ మారుతారనే విషయం తెలుసుకున్న మరో నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉన్న రేవంత్ రెడ్డి, కంచర్ల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. రేవంత్ ఫ్లెక్సీలు దగ్ధం చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
For a while now in Telangana, a bypoll has been rumoured likely from the Nalgonda Lok Sabha constituency, currently held by the ruling Telangana Rashtra Samiti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X