వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ తాగాలనుందా...క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉండాలి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :చిల్లర కష్టాలు వ్యాపారులను ఇబ్బందిపెడుతోంది. చిల్లర కారణంగా వ్యాపారాలను నష్టపోకుండా ఉండేందుకు వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ నష్టాన్ని కొంత వరకు తగ్గించుకొంటున్నారు. హైద్రాబాద్ లోని ఓ టీ స్టాల్ వ్యాపారి వినూత్నగా ఆలోచించి చిల్లర కష్టాల నుండి తప్పించుకొన్నాడు.

చిల్లర కష్టాలతో డిల్లీలో ఓ టీ స్టాల్ వ్యాపారి పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్నికల్పించాడు. ఇదే తరహాలో హైద్రాబాద్ కుచెందిన ఓ టీ స్టాల్ వ్యాపారి కూడ వినూత్నంగా ఆలోచించాడు. డెబిట్,క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్ని కల్పించాడు.

if u have credit or debit card sip tea

ఒక్క టీ తాగాలంటే ఆరు నుండి పది రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలు మరింత తీవ్రమయ్యాయి,చిల్లర కష్టాలు టీ స్ఠాల్ యజమానులపై పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో ఓ టీ స్టాల్ యజమాని క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించేందుకు వీలుగా మైక్రో ఎటిఎంను ఏర్పాటు చేశాడు. టీ తాగినవారు చిల్లర లేకపోతే తమ వద్ద ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించి వెళ్ళవచ్చు.ఈ నిర్ణయంతో టీ తాగేందుకు వచ్చిన వారు ఇబ్బందులు కొంత తగ్గిపోయాయి.

English summary
banned currency effect on small vendors.if u want sip tea pay money through credit, debit cards.banjarahills road no 12 teastall owner install a swipe machine in tea stall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X