వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు సీఎం అభ్యర్థి అయితే.., వీహెచ్‌కు పవన్ కౌంటర్, వీహెచ్ ఏమన్నారంటే...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తే, ఆయనకు తాను మద్దతిస్తానని, ప్రచారం కూడా చేస్తానని పవన్ అన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే, ఆ పార్టీకి తాను మద్దతిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ 'పాపం పసివాడు',టీఆర్ఎస్‌వి ఒట్టి మాటలే: రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలుపవన్ 'పాపం పసివాడు',టీఆర్ఎస్‌వి ఒట్టి మాటలే: రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

బుధవారం ఖమ్మం పర్యటనలో పవన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి ప్రచారం కూడా చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైనా తనకు గౌరవం ఉందని, అలాగే, వీహెచ్ పైనా ఉందని, ఎవరిపైనా ద్వేషం లేదని పవన్ అన్నారు.

జనసేన కాదు భజనసేన...

జనసేన కాదు భజనసేన...

తెలంగాణ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన' కాదని, ‘భజనసేన' అని ఆయన ఘాటుగా విమర్శించారు.

వీహెచ్‌కు పవన్ ఆఫర్...

వీహెచ్‌కు పవన్ ఆఫర్...

కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వీహెచ్‌తో కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘వీహెచ్.. మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం.. ప్రజాసమస్యలను తెలుసుకుందాం..' అని పవన్ వీహెచ్‌కు ఆఫర్ కూడా ఇచ్చారు.

కొత్త రాష్ట్రానికి సహకరిద్దాం...

కొత్త రాష్ట్రానికి సహకరిద్దాం...

ఏన్నో ఏళ్ల ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, రాష్ట్ర అభివ‌ద్ధిని దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.

నా పట్ల పవన్ అభిమానమది...

నా పట్ల పవన్ అభిమానమది...

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బుధవారం స్పందించారు. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తూ.. అంచెలంచెలుగా తాను పైకి ఎదగడం పవన్ వ్యాఖ్యల అర్థమై ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం అవాలనుకోవడం పవన్ కళ్యాణ్ అభిమానం అయి ఉండొచ్చని, అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. పవన్ వ్యాఖ్యలను ఎవరో ఒకరు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళతారని ఆయన చమత్కరించారు.

నువ్వు నాతో రా.. తీసుకెళ్తా...

నువ్వు నాతో రా.. తీసుకెళ్తా...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో ఇంకా మార్పు రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పవన్ తనపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఆయన గుర్తెరగాలని అన్నారు. పవన్ చేసే వ్యాఖ్యల మేరకే తన కామెంట్లు ఉంటాయని వీహెచ్ పేర్కొన్నారు. ‘నేను పవన్ తో పాటు వెళ్లడం కాదు.. పవన్ నాతో కలిసి వస్తానంటే కనుక పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా..' అని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Janasena Chief Pawan Kalyan told that if Congress Party declares V.Hanumantha Rao as it's Telangana CM Candidate in coming assembly elections he will support Congress and he will campaign for Hanumantharao's victory. While talking on Hanumantha Rao comments Pawan responded like this. After that Congress senior leader V.Hanumantha rao also responded on Pawan Comments. He said.. 'I will not come with you.. You come with me.. will go together to every house in telangana and I will prove the government's inability and corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X