దమ్ముంటే కేసీఆర్ను టచ్ చేయండి.. మా దమ్ము ఎంటో చూపిస్తాం.. వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ను నోటికి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీకు దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి .. అప్పుడు మా దమ్మ ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా బండి సంజయ్, అర్వింద్ మాట్లాడుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

రైతు బంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా.?
బీజేపీ నేతలు నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనను విమర్శించే అర్హత వారికి లేదన్నారు. రైతు బంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ను జెళ్లో పెడతామంటూ మొరుగుతున్న వెదవల్లారా దమ్ముంటే విచారణ జరిపించండి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్కవచ్చి నోటికి వచ్చినట్లు మొరిగింది. ఇంకొకడు అస్సాం నుంచి వచ్చి కేసీఆర్ మీద మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రాలో భూముల ధరలు డమాల్
బీజేపీ
పాలిత
రాష్ట్రాల
నుంచి
కూలీలు
తెలంగాణకు
వలస
వస్తున్నారు
కానీ,
మధ్యప్రదేశ్,
ఉత్తరప్రదేశ్,
బీహార్,
ఒరిస్సాలకు
తెలంగాణ
వెళ్తున్నారా
?
అని
నిలదీశారు.
బీజేపీ
పాలిత
రాష్ట్రాల్లో
ప్రజల
పరిస్థితి
అధ్వానంగా
ఉందని
విమర్శించారు
.
ఒకప్పుడు
ఆంధ్రోళ్లు
తెలంగాణలో
భూములు
కొనేవాళ్లు
..
నేడు
అది
రివర్స్
అయిందన్నారు.
తెలంగాణలో
వ్యవసాయ
భూములు
ధరలు
పెరిగితే
..
ఆంధ్రాలో
రేట్లు
డమాల్
అయ్యాయంటూ
కీలక
వ్యాఖ్యల
చేశారు.
తెలంగాణ
వాళ్లు
ఆంధ్రాలో
భూములు
కొంటున్నారని
పేర్కొన్నారు.

సంజయ్ , అర్వింద్ రాజీనామాకు సిద్ధమా..
రాష్ట్ర బీజేపీలో ఇద్దరు అబద్దాల కోరులు నోటికి ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మెంటల్, అర్వింద్ ఏమి లేనోడు, రేవంత్ రెడ్డి బుడ్డారఖాన్ అంటూ విరుచుకుపడ్డారు. అవాకులు చవాకులు పేలుతున్న మీకు దమ్ముంటే సీఎం కేసీఆర్ను టచ్ చేసి చూడండి.. అప్పుడు మా దమ్ము ఏంటో చూపిస్తామని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, సాగునీరు ఇస్తున్నారా? అని నిలదీశారు. మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, మరి బండి సంజయ్ , అర్వింద్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నిజామాబాద్ ఎంపీగా గెలచిన 5 రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చి .. మాట తప్పిన అర్వింద్ సిగ్గులేకుండా ఇంకా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.