వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు ఆశతో వివాహేతర సంబందం పెట్టుకొంది, భర్తను హత్య చేయించింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : డబ్బు ఆశతో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఈ డబ్బులకు కట్టుకొన్న భర్తే అడ్డుగా ఉన్నాడనిభావించి ప్రియుడితో కలిసి భర్త హాత్యకు ప్లాన్ వేసింది. ఈ పథకం ప్రకారం భర్త హత్యకు గురికాగా, హత్యకు పాల్పడిన నిందితులు పోలీసులకు దొరికారు.హత్యకు సూత్రదారులైన భార్య, ప్రియుడు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

హైదరాబాద్ లోని మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీలోని నోముల రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో అక్టోబర్ 29వ, తేదిన గోపలకృష్ణ హత్యకు గురయ్యారు.ఈ హత్యకు ఆయన భార్య నాగవినీలే కారణమైంది.గోపాలకృష్ణ రెండు కోట్లను అప్పు తీసుకొని డెయిరీ ఫాం పెట్టాడు. డెయిరీ పాంలో నష్టం వచ్చింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. తిరిగి నిలదొక్కుకోవాలని భావించాడు .భార్య, సోదరి, తల్లి కి చెందిన బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదువ పెట్టి లోన్ తీసుకొన్నాడు. వీరందరి నుండి 3 కిలోల బంగారాన్ని గోపాలకృష్ణ బ్యాంకులో పెట్టాడు.

లోన్ కోసం తరచూ బ్యాంకు కు వెళ్ళే గోపాలకృస్ణ కు బ్యాంకు మేనేజర్ డి. రవీందర్ సన్నిహితుడయ్యాడు.గోపాలకృస్ణ ద్వారా ఆయన భార్య నాగవినీల కూడ బ్యాంకు మేనేజర్ కు పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మద్య వివాహేతర సంబందానికి దారితీసింది.డెయిరీ ఫాం పెట్టిన గోపాలకృస్ణకు అప్పులు కావడంతో నాగవినీల తరచూ భర్తతో గొడవపడేది. అటూ బ్యాంకు మేనేజర్ తో వివాహేతర సంబందం కొనసాగిస్తోంది.భర్త వల్ల లాభం లేదనుకొని బ్యాంకు మేనేజర్ రవీందర్ తో కలిసి సూర్యాపేటలో వేరు కాపురం పెట్టింది నాగవినీల.

illegal affair for money

డబ్బుకోసం భర్త హాత్యకు ప్లాన్

బ్యాంకు మేనేజర్ తో వేరు కాపురం పెట్టిన నాగవినీల లోన్ కోసం కుదువ పెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేయించింది..గోపాలకృష్ణకు తెలియకుండానే ఈ తతంగం జరిగింది.అయితే ఈ నగలను విడిపించుకోవాలని గోపాలకృస్ణ భావించారు. తన ఐదెకరాల భూమిని విక్రయించి బ్యాంకులో కుదువపెట్టిన నగలను తీసుకెళ్ళాలనుకొన్నాడు. ఈ విషయం తెలిసిన బ్యాంకు మేనేజర్ రవీందర్, నాగవినీల పెద్ద పథకం వేశారు. గోపాలకృష్ణను హాత్య చేయిస్తే బంగారు ఆభరణాల గురించి ఎవరూ అడగరని భావించారు.

రవీందర్ తన బ్యాంకు ఖాతాదారుడైన గొల్ల యాదయ్యను సంప్రదించి గోపాలకృష్ణ విషయాన్ని వివరించాడు.యాదయ్య తన స్నేహితుడు మహ్మాద్ మన్సూర్ ను పరిచయం చేశాడు. 10 లక్షలు ఇస్తే హాత్య చేస్తే జుబేర్ ముఠా ఉందని చెప్పాడు. జుబేర్ కు 3 లక్షలను రవీందర్ అడ్వాన్స్ గా ఇచ్చారు. నోముల రెసిడెన్సీలో తన భర్తను హత్యకు నాగవినీల రెక్కీ నిర్వహించింది.

అాపార్ట్ మెంట్ లోని టెర్రస్ పైన పిల్లలు ఆడుకొంటుండగా బాణసంచా కొనుగోలు చేయాలని డబ్బులిచ్చి కిందకి పంపింది. వెంటనే జుబేర్ ముఠాకు సమాచారాన్ని ఇచ్చింది. జుబేర్ ముఠా భవనంలోకి ప్రవేశించి గోపాలకృష్ణను హత్య చేశారు. సిసి టివి లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

English summary
wife plan to her husband murder because of money. gopala krishna and his wife nagavineel live in moulali nomula residency. gopalakrishna loss with the dairy farm busisness.gopala krsihna put 3 kgs of gold in bank for borrow monedy. at that time nagavineela affair with bank manager ravinder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X