వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరిత హారం మొక్కలు తిన్న పశువుల యజమానిపై జరిమానా...!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమానికి చాల ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతోంది. అయితే నాటిన మొక్కల్లో సరైన సంరక్షణలేక సగం చెట్లు కూడ పెరిగే అవకాశం లేకుండా పోతుంది. దీంతో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడ అంతే ముఖ్యంగా బావించి పలు నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీ ఆ భాద్యతలు తీసుకున్నాయి. తమ గ్రామాలు పచ్చగా ఉండేందుకు పెద్ద ఎత్తున నడుం బిగించాయి. దీంతో ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని ప్రారంభించింది. అయితే గ్రామాల్లో నాటిన మొక్కలను పశువుల భారి నుండి కాపాడుకునేందుకు జరిమానాలను విధిస్తోంది..

ఇందులో భాగంగానే హరిత హారంలో నాటిన మొక్కలను గ్రామాల్లో ఉన్న పశువులు తినడంతో 1000 రుపాయాల జరిమానాను గ్రామపంచాయితీ అధికారులు సంబంధిత రైతుపై విధించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామాంలో చేటుచేసుకుంది. ఉగ్రవాయి గ్రామానికి చెందిన శంకర్‌ అనే రైతుకు చెందిన ఎడ్లు గ్రామ శివారులోని కమ్యూనిటి స్థలంలో నాటిన హరిత హారం మొక్కలను తిన్నాయి. దీంతో ఎడ్లు హరితహరం మొక్కలు తింటున్న సమయంలో చూసిన గ్రామపంచాయితీ చెందిన ఉద్యోగులు కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎడ్లకు సంబంధించిన యజమానికి 1000 రుపాయల జరిమాన విధించారు.

 imposed a fine of Rs.1000 for eating Harita haram saplings.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఈ జరిమానాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మేకలు, గొఱ్ఱెలు ,ఇతర పశువుల ఏవి తిన్నా...సంబంధిత యజమానులకు 500 రుపాయలకు పైగ జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఈ విధానంపై కొంతమంది విమర్శలు గుప్పిస్తుంటే మరికొంత మంది మాత్రం సహజ సంపదను కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందంటూ ప్రశంశలు గుప్పిస్తున్నారు.

English summary
The gram panchayat authorities have imposed a fine of Rs.1000 for eating Harita haram saplings.The incident took place in the Ugravai village of Kamareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X