• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు భారీ షాక్ : టీటీడీపీ చీఫ్ కు టీఆర్ఎస్ ట్రాప్ : భారీ ఆఫర్..!!

By Lekhaka
|

రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యల్లో ఉన్న టీడీపీకీ ఊహించని షాక్. ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ...ప్రతిపక్షంలో ఉంది. పార్టీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీకి దగ్గరయ్యారు. ఇక, మిగిలిన వారిలోనూ పలువురు వైసీపీతో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయానికి ముందే ఆ రాష్ట్రంలో టీడీపీ రాజకీయంగా దెబ్బ తింది. రాజకీయ పునాదులు బలంగా ఉన్న టీడీపీ తెలంగాణ ప్రాంతంలో ఊహించని విధంగా ఉనికి కోల్పోయింది. ఇక, 2018 ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో చేరటంతో అక్కడ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక, రాష్ట్ర విభజన తరువాత ఏపీ..తెలంగాణ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించి..తాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. తెలంగాణకు బీసీ వర్గానికి చెందిన ఎల్ రమణ కొనసాగుతున్నారు.

 గులాబీ నేతల ట్రాప్..

గులాబీ నేతల ట్రాప్..

రమణ 1994లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఖాదీ పరిశ్రమల మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో పని చేసారు. 1996 లె లోక్ సభ కు ఎన్నికయ్యారు. 2009 లో మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక, పార్టీ తెలంగాణలో ఉనికి కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ కీలక అడుగులు వేస్తోంది. కరీంనగర్ లో ఈటల పార్టీ నుండి బయటకు వెళ్లటంతో బీసీ నేతలకు అ జిల్లా నుండి ప్రాధాన్యత ఇవ్వాలని..అందులో భాగంగా ముఖ్యులను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టీ-టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మాజీ టీడీపీ నేత చర్చలు

మాజీ టీడీపీ నేత చర్చలు

ఎల్‌రమణను టీఆర్ఎస్ లో చేరాలని..తగిన గుర్తింపు ఇస్తామంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో టీడీపీలో ఉండి..ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నేత ఒకరు ఇందు కోసం బాధ్యతలు తీసుకొని చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, టీడీపీ ఏ రకంగా చూసినా..తెలంగాణలో తిరిగి కోలకుంటుందనే నమ్మకం కనిపించకపోవటం కూడా వారి ఆఫర్ వైపు రమణ ఆసక్తిగా చూడటానికి కారణంగా వినిపిస్తోంది. రమణ పార్టీలో చేరితో ఎమ్మెల్సీ ఇస్తామని..అయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవటంతో..వెంటనే నిర్ణయం తీసుకోవాలని గులాబీ నేతల నుండి ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

 ఎమ్మెల్సీ పదవి ఇస్తాం..ఇప్పుడు వస్తేనే..

ఎమ్మెల్సీ పదవి ఇస్తాం..ఇప్పుడు వస్తేనే..

ప్రస్తుతం మండలిలో ఖాళీ అయిన సీట్లు కరోనా కారణంగా ఎన్నికల సంఘం భర్తీ ప్రక్రియ వాయిదా వేసింది. అయితే, ఎమ్మెల్యే కోటాలోనే రమణకు పెద్దల సభలో అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..రమణ సైతం మొత్తబడ్డారని తెలుస్తోంది. ఈ వారంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీకి ఇది భారీ షాక్ గానే చెప్పుకోవాల్సి ఉంటుది. తొలి నుండి చంద్రబాబుతో ఉన్న కొందరు నేతలు మాత్రమే ఇప్పుడు తెలంగాణ టీడీపీలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేతే పార్టీ మారితే..టీడీపీకి మరింత నష్టం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే, త్వరలోనే రమణ టీఆర్ఎస్ లో చేరుతారని... ఎమ్మెల్సీ అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

English summary
T TDP chief L Ramana may soon join TRS. As per sources TRS leaders discussed with Ramana and assured about his political future in TRS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X