వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: తెరాసలోకి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: నీటి పారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై కాంగ్రెసు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కత్తులు నూరుతున్న సమయంలో వారికి షాక్ తగిలే వార్త బయటకు వచ్చింది. కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పొన్నం ప్రభాకర్ సోదరుని కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్‌ కంపెనీ టెలెకా నెట్‌వర్క్‌ టెక్నాలాజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. దీంతో పొన్న ప్రభాకర్ తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడదు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌, మాజీ మంత్రి గడ్డం వినోద్‌, తదితరులు తెరాసలో చేరిన సందర్భంలోనే పొన్నం ప్రభాకర్‌ కూడా తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడదు వినోద్‌ కుమార్‌ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతనే పొన్నం ప్రభాకర్‌కు పచ్చ జెండా ఊపాలని తెరాస నాయకత్వం భావించింది. దాంతో అప్పట్లో ఆయన చేరిక వాయిదా పడినట్లు చెబుతున్నారు.

In a big shock to Congress, Ponnam may join in TRS

ఇదిలావుటే, తనకు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేస్తేనే తెరాసలో చేరుతానని పొన్నం ప్రభాకర్ మెలిక పెట్టడం వల్ల చేరిక ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. వేములవాడ అసెంబ్లీ నియోజవర్గానికి వచ్చే ఎన్నికల్లో పొన్నంకు తెరాస కేటాయించే అవకాశమున్నదని కూడా ప్రచారం జరిగింది.

ప్రభాకర్‌ సోదరుడి కుమారుడు ప్రస్తుతం హుజూరాబాద్‌లో టెలెకా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా మంత్రి ఈటెల రాజేందర్‌, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన గడ్డం వివేక్‌ కూడా హాజరయ్యారు. దీంతో పొన్నం ప్రభాకర్ తెరాసలో చేరడం ఖాయమై పోయినట్లుగా ప్రచారం సాగుతోంది.

English summary
It is sid that Congress Karimanagar Ex MP Ponnam Prabhakar may join in Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X