వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో మోస్తరు వర్షం : పలుచోట్ల కరెంట్ కట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. భానుడి భగభగలతో అల్లాడిన జనానికి చల్లని గాలితో కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడగా .. రాత్రి 7 గంటల నుంచి నగరంలోని పాలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

in hyd rain : some places power cut

భాగ్యనగరంలో మోస్తరు వర్షం
అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బేగంపేట, ఎస్‌ఆర్‌నగర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మాదాపూర్‌, సనత్‌ నగర్‌, గచ్చిబౌలి, చిలకలగూడ, తార్నాక, మెహిదీపట్నం, కోఠి, హబ్సిగూడ, నాచారం, ఓయూ, తార్నాక తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వరంగల్‌లో కూడా ....
ఇటు వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం పడేముందు ఘట్ కేసర్ లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో గల చెట్టుపై పిడుగువేయడంతో అది కాలిపోయింది. ఓ వైపు తాటిచెట్టుకు మంటలు అంటుకోగా .. మరోవైపు వర్షం కురిసింది. చూడడానికి వింతగా అనిపించింది ఈ ఘటన.

English summary
With the influence of the surface trough, there was a moderate rainfall in the Telangana state. The people with the got relief from cold winds. The weather was cooled from the evening in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X