వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్‌లో మదిలో ఏముంది ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ పదవులు ఎవరికీ దక్కుతాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఆశావాహులు చాలామందే ఉన్నారు. ఈ నెల 31న జరిగే ఎన్నికకు నామినేషన్ వేసేందుకు 14వ తేదీ చివరి కావడంతో .. ఆ ముగ్గురు ఎవరనే చర్చ జరుగుతుంది.

పదవీ కోసం ప్రయత్నాలు

పదవీ కోసం ప్రయత్నాలు

ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా పదవీ కోసం ట్రై చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేరళ, తమిళనాడులో పర్యటిస్తున్న కేసీఆర్ .. ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓడిపోయిన మంత్రులు అజ్మీరా చందూలాల్, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లను పరిశీలిస్తారా అనే అంశంపై ప్రచారం జరుగుతుంది. కేవలం మూడు ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ వెలువడడం ... ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికీ అవకాశం దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. వీరితోపాటు నాయని నర్సింహారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. లోక్ సభ సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన పేరు కూడా పరిశీలించే ఛాన్స్ ఉంది. వీరితోపాటు నకిరేకల్ నుంచి పోటీచేసిన వేముల వీరేశం కూడా మండలి సీటు ఆశిస్తున్నారు.

ఒంటేరు కూడా ..

ఒంటేరు కూడా ..

శత్రువులకు కూడా ఓటేస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ పై పోటీచేసినా వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఏదో పదవీ ఇస్తారనే హామీనిచ్చారు. అయితే ముగ్గురిలో ఛాన్స్ ఇస్తారా లేదా అనే అంశం తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

English summary
Telangana state is 3 MLC positions. The MLAs of Warangal, Nalgonda and Ranga Reddy are optimistic. The end of the 14th to nominate for the election on this month 31. The three are debating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X