వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-బాబు అలా: కేసీఆర్‌కు మెయిల్ చేసినా, లేఖ రాసినా నో యూజ్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదా సీఎం కార్యాలయానికి ఈ మెయిల్స్ చేయడం లేదా లేఖలు రాయడం వల్ల ఉపయోగం లేదా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదా సీఎం కార్యాలయానికి ఈ మెయిల్స్ చేయడం లేదా లేఖలు రాయడం వల్ల ఉపయోగం లేదా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

సీఎంకు లేదా సీఎం కార్యాలయానికి ప్రజలు రాసే ఉత్తరాలు లేదా చేసే మెయిల్స్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు.

పీఎంవో, ఏపీ సీఎంవో ఇలా..

పీఎంవో, ఏపీ సీఎంవో ఇలా..

అదే సమయంలో ప్రధానమంత్రి (నరేంద్ర మోడీ) కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం ఆన్ లైన్ ఫిర్యాదులను నమోదు చేసుకుంటోంది. ఆధార్ కార్డ్ ఆధారంగా వాటిని స్వీకరిస్తోంది.

తెలంగాణలో అలా లేదు

తెలంగాణలో అలా లేదు

కానీ తెలంగాణలో మాత్రం అలాంటి సౌకర్యం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఆయనకు ప్రజలు దరఖాస్తులు ఇస్తారు. వాటిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.

అలా పంపిస్తారు.. ఫాలో అప్ చేయరు!

అలా పంపిస్తారు.. ఫాలో అప్ చేయరు!

సీఎంవోకు వచ్చే అప్లికేషన్లను అధికారులు ఆయా శాఖలకు, ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఆ అప్లికేషన్లను వారు రికార్డ్ చేసుకోవడం లేదని తెలుస్తోంది. రికార్డ్ చేసుకోవడం లేదా ఆ పని ఎక్కడి వరకు వచ్చిందని ఫాలో అప్ చేయడం వంటివి లేవని చెబుతున్నారు.

కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే..

కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే..

చాలామంది ఈ మెయిల్స్ లేదా లేఖల ద్వారా తమ సమస్యలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తుంటారు. కానీ అలా పంపిస్తే ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు.

2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారం రోజులకు [email protected] తో ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేశారు. కానీ దీనిని ఉపయోగించింది లేదని తెలుస్తోంది.

నీతి అయోగ్ నుంచి..

నీతి అయోగ్ నుంచి..

నీతి అయోగ్ నుంచి ముఖ్యమైన మెయిల్స్ వచ్చినా కూడా వారం పాటు జవాబు ఇవ్వని సందర్భం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, కేంద్రం నుంచి వచ్చే ఈ మెయిల్స్‌కు, వాటి సమాధానం కోసం అధికారులు మరో మెయిల్‌ను నిత్యం చూస్తుంటారు.

ప్రత్యేకంగా ఉద్యోగి

ప్రత్యేకంగా ఉద్యోగి

ఈ మెయిల్‌కు ప్రజలు సమస్యలను విన్నవించుకుంటే మాత్రం ఉపయోగకరంగా కనిపించడం లేదని అంటున్నారు. సాధారణంగా సీఎం లేదా సీఎం కార్యాలయానికి వచ్చే మెయిల్స్‌ను చెక్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని నియమిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి ఉద్యోగి లేరు.

ఉన్నతాధికారులు ముఖ్యమైన మెయిల్స్ చూస్తారు..

ఉన్నతాధికారులు ముఖ్యమైన మెయిల్స్ చూస్తారు..

ఉన్నతాధికారులు మాత్రం ముఖ్యమైన ఈ మెయిల్స్‌ను మాత్రం చెక్ చేస్తుంటారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు, రాష్ట్రానికి సంబంధించిన మెయిల్స్‌ను వారు చెక్ చేస్తుంటారు.

అన్నీ కుదరవు

అన్నీ కుదరవు

కానీ వారానికి వందలాది ఈ మెయిల్స్ ప్రజల నుంచి సీఎం కార్యాలయానికి వస్తుంటాయి. వాటినన్నింటిని చూసేందుకు ఉన్నతాధికారులకు కుదరదని సీఎంవో కార్యాలయం చెప్పారని అంటున్నారు.

లేఖలకూ అంతే

లేఖలకూ అంతే

అదే సమయంలో, సీఎంవోకు రోజుకు వందలాది లేఖలు వస్తుంటాయి. తమ సమస్యలపై ప్రజలు ఆ లేఖలు రాస్తారు. వాటిని ఆయా శాఖలకు, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తుంటారు. అయితే, అలా పంపిన లేఖల విషయం ఎక్కడి వరకు వచ్చిందని ఫాలో అప్ చేయడం లేదంటున్నారు.

English summary
Sending e-mails or writing letters to the Telangana Chief Minister or the Chief Minister’s Office is of no use. No one bothers to check emails or letters sent to the CM by citizens, or to acknowledge them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X