వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 విడతల్లో స్థానిక సమరం : రేపో, మాపో షెడ్యూల్ రిలీజ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలం వ్యక్తంచేయడం .. రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడంతో ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. రాష్ట్రంలోని 32 జెడ్పీలు, 530 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు

ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు

మే 6 వ తేదీన తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 22 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 24గా నిర్ణయించి .. విత్ డ్రా కోసం మరో నాలుగు రోజుల సమయం ఇస్తారు. మే 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను మాత్రం లోక్ సభ ఫలితాల తర్వాతే వెల్లడిస్తారు.

రెండో విడత ఎన్నికలు

రెండో విడత ఎన్నికలు

మే 10వ తేదీన రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తామనే సంకేతాలను ఈసీ ఇచ్చింది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 28. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు అవకాశం ఇచ్చారు. మే10వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.

చివరి విడత ఎన్నికలు

చివరి విడత ఎన్నికలు

ఇక చివరి విడత మే 14వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే మే 2వ తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు మే 6 వరకు అవకాశం ఉంది. మే 14వ తేదీన పోలింగ్ జరగనుంది.

English summary
Telangana state has been undertaken to organize local organizations. The Election Commission has been engaged in electoral arrangements, as the state government has finalized the dates. It is credible that the Election Commission is expected to conduct elections in three phases for the 32 ZPs and 530 MPTCs in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X