వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్ను చెల్లింపులో జాగ్రత్తలు ఇలా, లేకపోతే టిడిఎస్ లో మార్పులు చేర్పులయ్యే అవకాశం

పన్ను చెల్లింపు విషయంలో తమ వ్యక్తిగత యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఇతరులతో పంచుకోకూడదని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది. యూజర్ నేమ్ , పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొనే విషయంలో కూడ పలు జాగ్రత్తలను సూచించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు అనేక వక్రమార్గాలను అన్వేషిస్తున్నారు.అయితే పన్ను చెల్లింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అక్రమార్కులు తమకు అనుకూంగా మలుచుకొనే అవకాశం ఉందని ఆదాయపు పన్నుశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆన్ లైన్ లో పన్ను చెల్లించేసమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆధాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

పన్ను చెల్లింపు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది.ఆన్ లైన్ లో ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో తమ వ్యక్తిగత యూజర్ ఐడి, పాస్ వర్డ్ ను ఇతరుకు చెప్పకూడదని ఆదాయపు పన్నుశాఖాధికారులు తేల్చి చెప్పారు.

income tax pay

ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్నుశాఖ కోరింది. టిడిఎస్ లోని రహస్య సమాచారం , కీలకమైన డాటా దిద్దుబాటుకు గురికాకుండా ఉండాలంటే వ్యక్తిగత యూజర్ ఐడి, పాస్ వర్డ్ ను ఎవరికీ చెప్పకుండా ఉండాలని ఆదాయపు పన్నుశాఖ కొరింది.

ఒకవేళ పాస్ వర్డ్ , యూజర్ నేమ్ హ్యాక్ కు గురైనా, దొంగతనానికి గురైన టిడిఎస్ సమాచారంలో మార్పులు చేర్పులు చేసే ప్రమాదం నెలకొందని ఐటిశాఖ హెచ్చరించింది.ఫలితంగా తీవ్రంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఐటి శాఖ అభిప్రాయపడింది.

యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు ఎలా క్రియేట్ చేసుకోవాలి

యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు క్రియేట్ చేసుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదాయపు పన్నుశాఖ సూచించింది. సులభంగా గుర్తించేటట్టుగా పిల్లల పేర్లు, తమకున్న ముద్దుపేర్లు, ఇంటి పేర్లు, ఫోన్ నెంబర్లు తదితర పేర్లను వాడకూడదని కోరింది. ఎనిమిది అక్షరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు, గుర్తులు ఉండేలా యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోవాలని ఐటి శాఖ సూచన చేసింది.తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్ లకు సంబందించిన సమాచారాన్ని కంప్యూటర్ , పోన్ లో భద్రపర్చడం కంటే ప్రత్యేకంగా నోట్ బుక్ లో రాసి పెట్టుకోవాలని చెప్పింది. ఒకవేళ కంప్యూటర్ హ్యాక్ కు గురైన ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆదాయపు పన్నుశాఖాధికారులు చెప్పారు.

English summary
income tax department has warned taxpayers against sharing their use id and password with any authorised person,saying they too will be label to face consequences for misue of their confidential information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X