వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భారీ' షాక్: ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయడం ఆలస్యమైతే.. అంతే!

నిర్దేశించిన గడువు లోపు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్దేశించిన గడువు లోపు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఫైనాన్షియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు.

రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను...రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు: ఇదీ జైట్లీ ఆదాయ పన్ను...

కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234 ఎఫ్ కింద ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్షియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు.

Income tax return: Budget 2017 proposes a fee for delayed filing of income tax return

రెండుస్థాయిల్లో జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదే రోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది.

మరేదైనా సందర్భాలలో అయితే రూ.10వేల వరకు జరిమానా కట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. అదే మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటిని వారికి కేవలం రూ.1000 జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

English summary
Taxpayers who do not file their Income Tax Returns (ITRs) on time will have to shell out a penalty of upto Rs 10,000, but from the 2018-19 Assessment Year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X