వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ కార్యాలయాల్లో జెండా పండుగ, జాతీయ పతాకం ఆవిష్కరించిన నేతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలుగడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సారి కూడా గోల్కొండ కోట వేడుకకు సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు. జాగీలాలతో అణువణువూ పరిశీలిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జెండా పండుగ వేదికను ప్రభుత్వం మార్చారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను .. గోల్కొండ కోటకు మార్చారు. 2014 నుంచి వరుసగా గోల్కొండ కోటలోనే జెండాను సీఎం ఆవిష్కరిస్తున్నారు. వరుసగా ఆరోసారి గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండ ఎగరేయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గోల్కొండ కోటలో నిర్వహించే జెండా పండుగ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. జెండా వందనం, సీఎం కాన్వాయ్ కోసం పోలీసు బలగాలు రిహార్సల్స్ నిర్వహించారు.

Independence Day Celebrations In Telangana At Golconda Fort: Live Updates

Newest First Oldest First
10:47 AM, 15 Aug

కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
10:45 AM, 15 Aug

బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్
10:45 AM, 15 Aug

టీడీపీ కార్యాలయంలో జెండా పండుగ : జాతీయ పతాకాన్ని ఎగరవేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
10:41 AM, 15 Aug

తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో జెండా పండుగ, జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
10:40 AM, 15 Aug

జెండా ఆవిష్కరణ అనంతరం కేటీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా కార్యకర్తలు, వారికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
10:39 AM, 15 Aug

జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు దానం నాగేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి
10:38 AM, 15 Aug

తెలంగాణ భవన్‌లో ఘనంగా జెండా పండుగ. జాతీయ జెండాను ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
10:25 AM, 15 Aug

గుస్సాడీ, గొండి కళారూపాలను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు
10:24 AM, 15 Aug

నగర, పేరిణి తదితర కళాకారులు సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారు
10:21 AM, 15 Aug

జై హింద్, జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన సీఎం కేసీఆర్
10:21 AM, 15 Aug

తెలంగాణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా : సీఎం కేసీఆర్
10:19 AM, 15 Aug

త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానుంది : కేసీఆర్
10:19 AM, 15 Aug

పాత రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తాం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడతాం
10:19 AM, 15 Aug

దృష్టి లోపాలను సవరించుకునే పథకం కంటి వెలుగు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేస్తాం. దీంతో ప్రజలకు మేలు జరుగుతుంది
10:17 AM, 15 Aug

న్యాయవాదుల, జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడతాం : కేసీఆర్
10:16 AM, 15 Aug

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విస్తరిస్తామని కేసీఆర్ వెల్లడి
10:16 AM, 15 Aug

ఇప్పడున్న నీటితోపాటు అదనంగా 575 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చన్న కేసీఆర్
10:16 AM, 15 Aug

వచ్చే ఏడాది నుంచి సాగునీరు అందిస్తామని కేసీఆర్ వెల్లడి
10:15 AM, 15 Aug

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 400 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు : కేసీఆర్
10:15 AM, 15 Aug

ఎండ, వానను లెక్కచేయక .. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు : కేసీఆర్
10:14 AM, 15 Aug

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలసిరులే, ఇటీవల ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ సీఎంలతో కలిసి ప్రారంభించామని తెలిపిన కేసీఆర్
10:14 AM, 15 Aug

రూ. లక్ష వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని ఆదేశాలు జారీచేశాం : కేసీఆర్
10:13 AM, 15 Aug

రైతుబంధు, రైతు భీమా తెలంగాణ స్థాయిని పెంచిన పథకాలు, ఐక్యరాజ్యసమితి కూడా పొగిడిందని గుర్తుచేసిన కేసీఆర్
10:12 AM, 15 Aug

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫించన్లను పెంచాం : కేసీఆర్
10:11 AM, 15 Aug

పల్లెలు ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా బలోపేతం చేస్తాం : కేసీఆర్
10:11 AM, 15 Aug

డబ్బు పెట్టి వానలను కొనలేమని పేర్కొన్న కేసీఆర్, రాబోయే తరానికి ఆస్తిపాస్తులు కాదు ఇవ్వాల్సింది మంచి వాతావరణం
10:10 AM, 15 Aug

మొక్కలు నాటే విషయంలో, కాపాడే విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదని ప్రజలకు కేసీఆర్ పిలుపు
10:09 AM, 15 Aug

పచ్చదనం పెంపొందించేందుకు కృషిచేయాలి : కేసీఆర్
10:09 AM, 15 Aug

విద్యుత్ సిబ్బంది వారం రోజులు గ్రామాల్లో ఉండి సమస్యలను పరిష్కరిస్తారు : సీఎం కేసీఆర్
10:09 AM, 15 Aug

వేలాడుతున్న కరెంట్ వైర్లతో ఇబ్బంది, కొన్నిచోట్ల మూడో వైర్ లేకపోవడంతో చీకటి అలుముకుంది, దీనిని సరిచేయాలని కేసీఆర్ ఆదేశం
READ MORE

English summary
Golconda Fort is ready for the independence day ceremony. The authorities have already completed the arrangements. CM KCR unveils the national flag on the fort. Earlier, police received a salute from the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X