వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నంబర్ వన్.. కరోనా పాజిటివ్‌లో ఇండియా..?.. అధ్యయనం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసుల్లో భారతదేశం త్వరలో మొదటి స్ధానంలోకి రానున్నది. ఈ విషయాన్ని హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం అంచనా వేసింది. 4 నెలల్లో కరోనా వైరస్ కేసుల నమోదును లెక్కగట్టి.. వచ్చేనెలలో భారత్ తొలి స్ధానంలో నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా.. భారత్‌లో 46 లక్షలకు పైగా కేసులు ఉన్న సంగతి తెలిసిందే.

నాలుగు నెలల్లో నమోదైన కరోనా వైరస్ కేసుల ఆధారంగా రెండు మోడళ్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలవచ్చునని తెలిపారు. అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టీఎస్ఎల్ రాధిక ఈ విషయాలను వివరించారు.

india will be number one place in world for coronavirus..

ఇదేకాదు సెప్టెంబర్ 5 లేదా 6వ తేదీన కేసుల సంఖ్యలో భారత్ బ్రెజిల్‌ను దాటిపోతుందని గతంలో అంచనా వేశామని వివరించారు. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 7వ తేదీన భారత్ అత్యధిక కరోనా కేసులు కలిగిన రెండో దేశంగా నిలిచింది. బ్రెజిల్‌ దేశాన్ని అధిగమించిందని ఆమె తెలిపారు. గణాంక శాస్త్రానికి చెందిన ఆటోరిగ్రెస్, గ్రోత్ రేట్ మోడళ్ల ఆధారంగా అంచనాకు వచ్చామని తెలిపారు.

English summary
india will be number one place in world for coronavirus next month first week bits pilani study revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X