దిల్సుఖ్ నగర్ పేలుళ్లు: 'ఇండియన్ బిన్ లాడెన్' ఖురేషీ అరెస్ట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: 2013లో హైదరాబాద్ పేలుళ్లు, 2008లో గుజరాత్ పేలుళ్ల కేసు నిందితుడు ఖురేషీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఖురేషీ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. సిమి కార్యకర్త కూడా. ఇతని కోసం జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) చాలా కాలంగా వెతుకుతోంది. అతనిపై పెద్ద ఎత్తున రివార్డు కూడా ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.

ఖురేషీ బాంబులు తయారు చేయడంలో నిష్ణాతుడు. అతనిని సహచరాలు ఇండియన్ ఒసామా బిన్ లాడెన్గా పిలుచుకుంటారు. 2008 ముంబై పేలుళ్లలో కూడా ఇతని పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి.