వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాకొద్దన్నా.. భారతీయ మహిళ మీదమీదకు ఆఫ్రికన్ అమెరికన్ (వీడియో)

న్యూయార్క్ మెట్రో రైల్లో వెళ్తున్న ఓ భారతీయ మహిళను కొందరు వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. బాధితురాలి పేరు ఏక్తా దేశాయ్.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: న్యూయార్క్ మెట్రో రైల్లో వెళ్తున్న ఓ భారతీయ మహిళను కొందరు వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. బాధితురాలి పేరు ఏక్తా దేశాయ్.

ఏక్తా దేశాయ్ న్యూయార్క్ మెట్రో రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో తన సీటు పక్కలోనే కూర్చొన్న ఆఫ్రో అమెరికన్‌ జాతి వివక్ష ప్రదర్శించాడు. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్న ఆమె తన మొహం మీదకు అమెరికన్‌ వచ్చి అరుస్తున్నా తొలుత పట్టించుకోలేదు.

<strong>శ్రీనివాస్ కూచిభొట్ల-సునయనలు వారికి అమితాబ్-జయాబచ్చన్!</strong>శ్రీనివాస్ కూచిభొట్ల-సునయనలు వారికి అమితాబ్-జయాబచ్చన్!

ప్రవర్తన తీవ్రంగా ఉండటంతో హెడ్‌ఫోన్లు తీసేసింది. అప్పుడు అతను.. మీ దేశానికి వెళ్లిపో అని హెచ్చరించాడు. ఏక్తా తన ఫోన్‌తో రికార్డ్ చేస్తుండగా.. నేను తిడతానని, నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పాడు.

తనను తాకవద్దు అని ఆమె హెచ్చరించినా వినకుండా బెదిరిస్తూ భయపెడుతూ మీదమీదకు వచ్చాడు. ఆమెను నోటికి వచ్చినట్లుగా తిట్టాడు.

ఆ తర్వాత ఎక్తా దేశాయ్‌ పక్కనున్న ఆసియన్‌ మహిళ మీద తన తిట్ల ప్రతాపం చూపించాడు. అతడి విద్వేషాన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించిన ఎక్తా దేశాయ్‌ మొదట దాన్ని బయట పెట్టలేదు.

<strong>నాకే అలాంటి పరిస్థితి వస్తే.., భారతీయులు స్నేహితులయ్యారు: ఇయాన్ </strong>నాకే అలాంటి పరిస్థితి వస్తే.., భారతీయులు స్నేహితులయ్యారు: ఇయాన్

కాన్సస్‌లో జాతి విద్వేష దాడిలో శ్రీనివాస్‌ కూచిభొట్ల మృతి తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అతను అసభ్యంగా ప్రవర్తించిన పావు గంట తర్వాత పోలీసులు వచ్చారని, వారేమీ అతనిపై చర్య తీసుకోలేదని పేర్కొన్నారు.

అంతకుముందే ఈ సంఘటన జరిగింది. కానీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి అనంతరం ఆమె వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఆరు రోజుల్లో 33 వేల వ్యూస్ వచ్చాయి.

English summary
An Indian-origin girl was racially abused by a stranger in a New York train while she was on the way to her work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X