హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ప్రొఫెసర్‌‌కు సైన్స్ రీసెర్చ్ అవార్డు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ శ్రీకాంత్ జగబత్తులకు ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ రీసెర్చ్ అవార్డు లభించింది. న్యూయార్క్ యూనివర్సిటీ, స్నెర్ట్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అయిన శ్రీకాంత్ జగబత్తులకు ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్‌మెంట్ అవార్డు(కెరీర్)'ను సైన్స్ ఫౌండేషన్ ప్రకటించింది.

ఈ అవార్డు కింద శ్రీకాంత్‌కు ఐదేళ్లకు గాను మొత్తం 5 లక్షల డాలర్ల(రూ. 3.10 కోట్లు) ఇవ్వనున్నారు. బిజినెస్ రంగంలో ఉపయోగపడే సమాచార సాంకేతిక(ఐటీ) సంబంధమైన ‘డాటా-డ్రివెన్ మాడలింగ్ అండ్ లర్నింగ్ టెక్నిక్స్' అంశంలో పరిశోధనలకు సంబంధించి ఈ రీసెర్చ్ అవార్డు లభించింది.

 Indian-origin scientist gets $500k research award

ఇక హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ జగబత్తుల ఐఐటీ బాంబేలో చదివారు. వ్యాపారంలో ఇలాంటి పద్ధతులు ఉన్నప్పటికీ శ్రీకాంత్ వాటికి భిన్నమైన అప్లికేషన్లను రూపొందించనున్నారు. వ్యాపార నిర్వహణకు సంబంధించిన కొనుగోళ్లు, మార్కెటింగ్‌అధ్యయనాలు, ఇన్సూరెన్స్ పాలసీల ఆధారంగా కొత్తపద్ధతులను అమలుచేసేందుకు శ్రీకాంత్ పరిశోధనలతో దోహాదపడతాయి.

English summary
Professor Srikanth Jagabathula, from the New York University Stern School of Business, was recently recognized by the National Science Foundation (NSF) with its Faculty Early Career Development Award (CAREER).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X