వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిగో మరో నిర్వాకం.. ప్రయాణికులను వదిలేసి బయల్దేరిన విమానం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇండిగో విమానయాన సంస్థ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే, ఈ సారి ప్రయాణికులను కొట్టికాదు... ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలేసి మరో వివాదానికి తెరలేపింది.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ప్రయాణికులను విమానాశ్రయంలో వదిలేసి ఇండిగో వార్తల్లోకెక్కింది. గోవా-హైదరాబాద్ ఇండిగో విమానం (6E 259) సోమవారం గోవాలో 14 మంది ప్రయాణికులను వదిలేసి.. నిర్ణీత సమయం కంటే ముందుగానే హైదరాబాద్‌కు బయల్దేరింది.

Indigo Goa-Hyderabad flight departs 'early', leaves 14 passengers behind

ఈ విమానం గోవా నుంచి రాత్రి 10.50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 25 నిమిషాల ముందే వెళ్లిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు. ఇండిగో సిబ్బంది ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేయలేదని, విమానం వెళ్లిపోయినట్లు తెలిసి ఆశ్చర్యపోయామని తెలిపారు. అర్ధరాత్రి 12.05 గంటలకు (మంగళవారం) హైదరాబాద్‌కు రావల్సిన ఈ విమానం రాత్రి 11.40 గంటలకే చేరుకోవడం గమనార్హం.

ప్రయాణికులదే తప్పు: ఇండిగో

మరోవైపు ఈ ఘటనపై ఇండిగో ప్రయాణికులనే తప్పుబట్టింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు బోర్డింగ్ గేట్ మూసివేయగా, ఆ ప్రయాణికులంతా 10.33 గంటలకు గేట్ వద్దకు వచ్చారని ఆరోపించింది. బోర్డింగ్ గేట్ ముసివేయడానికి ముందు ఇండిగో సిబ్బంది హ్యాండ్ మైకులతో పదే పదే అనౌన్స్‌మెంట్ చేసినా ప్రయాణికులు స్పందించలేదని పేర్కొంది.
ప్రయాణికుల ఫోన్ నెంబర్లకు సైతం తమ సిబ్బంది ఫోన్ చేశారని తెలిపింది. అయితే, ఆ ఫోన్ ప్రయాణికుల ట్రావెల్ ఏజెంట్ థామస్ కుక్‌కు వెళ్లిందని, అతను ప్రయాణికుల ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి నిరాకరించాడని ఇండిగో వివరించింది. ఆ విమానాన్ని అందుకోలేకపోయిన ప్రయాణికులను మంగళవారం ఉదయం మరో విమానంలో ఉచితంగా గమ్యానికి చేర్చామని పేర్కొంది.

English summary
Fourteen passengers who had boarding passes for an Indigo Goa-Hyderabad flight were left behind at Goa airport on Monday. The stranded passengers alleged that the flight departed earlier than its scheduled time without making any announcement. An Indigo spokesperson countered their claims, saying that the airline made several announcements calling the passengers to report at the gate. Flight 6E 259 was scheduled for a 10.50pm departure yesterday, but left 25 minutes before the scheduled time according to the passengers. The 14 passengers, who had their boarding passes and were waiting to board the flight, were left behind unawares at the airport.The flight's scheduled time of arrival in Hyderabad was 12.05am, but it landed at 11.40pm. An Indigo spokesperson said that the passengers were declared "gate no-show".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X